బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 19 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక ప్రతీ సీజన్‌లో జుట్టు కత్తిరించే కార్యక్రమం పెట్టే బిగ్ బాస్ ఈ సీజన్‌లోనూ తీసుకురాగా ఈ సారి ప్రియాంక వంతు వచ్చేసింది. నాలుగు వారాలు ఇమ్యూనిటీతో పాటు మూడో ఇంటిసభ్యుడిగా నిలిచి పరరాస్త్ర పొందడానికి పోటీ దారులుగా నిలబడాలంటే అమర్ దీప్, ప్రియాంకలు తమ బొచ్చుని త్యాగం చేయాలని టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
అమర్ దీప్ వెనుకడుగు వేయడంతో ప్రియాంక ధైర్యంగా ముందుకొచ్చింది. దామిని…ప్రియాంక హెయిర్‌ని కట్ చేయగా తన కొత్త లుక్ చూసి మురిసిపోయింది. ఇక అమర్ దీప్.. తాను గుండు కొట్టించుకోలేక చేతులెత్తేసినదాన్ని కూడా పాజిటివ్ వేలో చిత్రీకరించారు. లాస్ట్ వీక్ నాగార్జున గారు.. నేను ఏం ఆడటం లేదని.. రెడ్ మార్క్‌లో పెట్టారు.. ఇప్పుడు నీకోసం (ప్రియాంక) త్యాగం చేశాను నాకు గ్రీన్ మార్క్ వేస్తారని చెప్పాడు. అయితే అమర్‌కు తెలియంది ఏంటంటే ఈ టాస్క్‌లోనూ ఆడలేక గీవప్ ఇచ్చేశాడు.
రెండో సీజన్ నుంచి వరుసగా.. దీప్తి సునైనా, శివజ్యోతి, దేత్తడి హారిక, అమ్మా రాజశేఖర్, వాసంతి బిగ్ బాస్ ‘బొచ్చు’ టాస్క్‌లో తమ జుట్టు ఇచ్చేశారు.
Also Read:టీడీపీ రూట్ మ్యాప్.. పవన్ చేతిలో?