BB7 Telugu:ఓటింగ్ టాప్‌లో పల్లవి ప్రశాంత్

126
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెండో వారం విజయవంతంగా సాగుతోంది. ఇక రెండో నామినేషన్స్‌లో మెజార్టీ సభ్యులు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేశారు. ఇక నామినేషన్స్ సందర్భంగా రచ్చరచ్చ జరిగింది. రైతు బిడ్డ అంటూ సింపథి కోసం ప్రశాంత్ ట్రై చేస్తూన్నాడని 9 మంది సభ్యులు ప్రశాంత్‌ని ఎలిమనేషన్‌కి నామినేట్ చేశారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ప్రేక్షకులు మాత్రం పల్లవి ప్రశాంత్‌ని అగ్రస్థానంలో కూర్చోబెట్టేశారు. బుధవారం రాత్రి నుండి ఆన్ లైట్ ఓటింగ్ ప్రారంభంకాగా ప్రశాంత్‌కి మద్దతుగా నిలుస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు 75 వేల మంది ఓటింగ్‌లో పాల్గొనగా 32,562 ఓట్లతో 43.67 శాతాన్ని సాధించి టాప్‌లో ఉన్నాడు ప్రశాంత్. నామినేషన్స్ ఎపిసోడ్‌తో ప్రశాంత్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది . ఇక ప్రశాంత్‌ని టార్గెట్ చేసిన అమర్ దీప్‌కి కేవలం 16 శాతం ఓట్లు పడగా శివాజీకి 14 శాతం ఓట్లు పడ్డాయి. లీస్ట్‌లో షకీలా 2 వాతం ఓట్లతో ఉన్నారు.

Also Read:రేవంత్ vs రాహుల్ గాంధీ.. హస్తంలో నయా లొల్లి!

ఇదే ఫ్లో కంటిన్యూ అయితే షకీలా ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా నామినేషన్స్ ఎపిసోడ్‌తో ప్రశాంత్ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.

- Advertisement -