Bigg Boss 7 Telugu:శివాజీకి ఊహించని షాక్

28
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా నాలుగోవారం పూర్తి చేసుకోవడానికి వచ్చింది. ఇక నాలుగోవారం వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చారు కింగ్ నాగ్. సందీప్ – శివాజీలను ఆటాడుకున్నారు. పనిలో పనిగా శివాజీ పవరాస్త్రను వెనక్కి తీసుకున్నారు. ఇక గౌతమ్‌ను బెల్టుతో కొట్టిన తేజకు జైలు శిక్ష విధించారు. ఇక రతికకు క్లాస్ పీకగా ఈ ఎపిసోడ్ మొత్తం ఆసక్తికరంగా సాగింది.

తొలుత నాలుగో పవరాస్త్ర టాస్క్‌లో ఓడిపోవడంతో ఫీలవుతున్న యావర్‌ను శివాజీ ఓదార్చాడు. తర్వాత శాస్త్రి బామ్ ప్రచారం కోసం ఓ ఫన్నీ గేమ్ పెట్టారు. హౌస్‌లో తలనొప్పి తెప్పించే క్యాండెట్ ఎవరు? స్ట్రెస్ రిలీఫర్ ఎవరో చెప్పాలంటూ ప్రతి ఒక్కరిని బిగ్‌బాస్ అడిగారు. దీంతో ఒక్కొక్కరు వాళ్ల అభిప్రాయాల ప్రకారం చెప్పారు. అయితే రతిక తనకి ప్రశాంత్ తలనొప్పి అంటూ చెప్పింది. ప్రశాంత్ కూడా తిరిగి రతిక పేరే చెప్పాడు.

తర్వాత మన టీవీలో కంటెస్టంట్లను చూపించారు నాగార్దున. తేజతో క్లాస్ పీకడం మొదలుపెట్టిన నాగ్…నువ్వేమైనా గుడ్డోడివా.. నీకు ఏమవుతుందో కనబడట్లేదా.. అంటూ స్మైలింగ్ ఛాలెంజ్‌లో గౌతమ్ మెడకి బెల్టు వేసి తేజ కొట్టిన వీడియో చూపిస్తూ సీరియస్ అయ్యారు నాగ్. అలానే శివాజీని కూడా తిట్టారు. కెమెరా ముందు నిల్చున్నావ్ కదా నువ్వెందుకు చెప్పలేదు అన్నారు. దానికి శివాజీ కవర్ చేద్దామని చూసినా వీడియో వేసి నోరు మూయించారు నాగ్.

Also Read:స్కంద 2 రోజుల కలెక్షన్ ఎంతంటే..?

ఇక ఆ తర్వాత ఆ గేమ్ సంచాలకుడిగా ఉన్న సందీప్‌ని వాయించేశారు. తర్వాత తేజని జైలులో పెట్టడంతో పాటు నామినేషన్స్‌తో సంబంధం లేకుండా తర్వాతి వారం తేజకి డైరెక్ట్ నామినేషన్ ఉంటుందని వెల్లడించారు. శుభశ్రీతో శివాజీతో జరిగిన గొడవ గురించి తాను ఎందుకు ఇబ్బందిగా ఫీలైందో చెప్పాలని నాగార్జున అడిగారు. ఈ మొత్తం వ్యవహారంలో శివాజీతో సారీ చెప్పించాలా అని నాగ్ అడగ్గా లేదు అనడంతో ఈ విషయం క్లోజ్ అయింది. తర్వాత ప్రశాంత్‌ని లేపి గౌతమ్-శోభా గొడవకు సంబంధించిన విషయాన్ని తీసి గౌతమ్‌కి క్లాస్ పీకాడు నాగ్. దీంతో శోభకు సారీ చెప్పాడు గౌతమ్.

ఇక నాలుగో పవరాస్త్ర గెలిచిన ప్రశాంత్‌ని నాగ్ ప్రశంసించారు. యావర్ చేతుల మీదుగా పవరాస్త్రను ప్రశాంత్‌కి ఇప్పించారు. ఈ టాస్క్ ఆడుతున్న ప్రశాంత్‌ని ఇబ్బంది పెట్టడానికి తప్పుగా మాట్లాడాల్సిన అవసరమేముందని రతిక-అమర్‌లను నాగార్జున అడిగారు. దాన్ని కవర్ చేసుకుంటూ రతిక మాట్లాడటంతో సిగ్గుందా.. ఇట్లనే పెంచిండ్రా అంటూ వాళ్ల ఇంట్లో వాళ్లని లాగడం ఎందుకు.. అమ్మా సిగ్గుందా రతిక అంటే నువ్వు తీసుకుంటావా.. తీసుకోవు కదా.. పార్టిసిపేట్ చెయ్.. పర్సనల్ చేయకు అంటూ వార్నింగ్ ఇచ్చారు. తర్వాత జడ్జిమెంట్‌లో శివాజీ పక్షపాతంగా వ్యవహారించాడని ఎక్కువమంది కంటెస్టెంట్స్ అభిప్రాయపడటంతో ఆయన దగ్గర ఉన్న పవరాస్త్రని వెనక్కి తీసుకుని శివాజీ కేవలం కంటెస్టెంట్ మాత్రమే అంటూ నాగ్ ప్రకటించారు.

Also Read:ఎమ్మెల్సీ కవితకు బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం

- Advertisement -