బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెండో వారం నేటితో పూర్తికానుంది. ఇక ఇవాళ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుండగా హౌస్ నుండి ఎవరు బయటికి వస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉండగా ఎలిమినేషన్ నుండి శివాజీ, అమర్ దీప్ సేవ్ అయ్యారు. దీంతో మిగిలి ఏడుగురిలో పల్లవి ప్రశాంత్, రతిక, తేజ, షకీలా, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ లలో ఎవరు హౌస్ నుండి బయటకు వస్తారోననే ఉత్కంఠ నెలకొంది.
అయితే సోషల్ మీడియాలో బిగ్ బాస్ ఎలిమినేషన్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఉల్టా పల్టా సీజన్ కావడంతో ఏదైనా జరగొచ్చు అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ వారం నామినేషన్‌లో ఉన్నవారిలో పల్లవి ప్రశాంత్ కు ఎక్కువ ఓట్లు రాగా అందరి కంటే తక్కువగా షకీలా, టేస్టీ తేజాలకు వచ్చాయి. ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ ఉంటే షకీలా, డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరూ బయటికి రావడం ఖాయమని ప్రచారం జరుగతోంది. అయితే షకీలా ఎలిమినేట్ కావడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక హౌస్ నుండి తొలివారం కిరణ్ రాథోడ్ బయటికి వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:చంద్రబాబుకు సానుభూతి వర్కౌట్ అయ్యేనా?