బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు 7 విజయవంతంగా రెండోవారానికి చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్‌లో 9 మంది ఉండగా ఇవాళో,రేపో హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. ఇక ఎపిసోడ్ 13 ఆధ్యంతం ఆసక్తిగా సాగింది. షకీలా కాళ్లు మొక్కింది రతిక. ప్రిన్స్ యావర్- గౌతమ్ కృష్ణ గొడత తారాస్ధాయికి చేరగా ఓ దశలో ఇద్దరూ కొట్టుకుంటారేమో అనే లెవల్ వరకు వెళ్లింది. రెండో పవరాస్త్ర గెలుచుకునే అవకాశాన్ని మొత్తం ముగ్గురికి కల్పించాడు బిగ్‌బాస్. ఇందు కోసం ఓ స్పెషల్ టాస్క్ కూడా పెడుతూ చివరలో ట్విస్ట్ ఇచ్చాడు.
యావర్ దగ్గరి నుంచి మాయాస్త్రను తీసుకొని శివాజీకి ఇచ్చేందుకు డిసైడ్ అయ్యాడు గౌతమ్. దీంతో గొడవ స్టార్ట్ అయింది. దీనికి యాపర్ ఒప్పుకోకపోవడంతో రచ్చరచ్చ జరిగింది. తర్వాత రతిక నెమ్మదిగా తన స్ట్రాటజీ ప్లే చేసింది. అసలు ప్రిన్స్‌కి ఎందుకివ్వలేదు పుల్లలు పెట్టే ప్రయత్నం చేసింది. ఇది చూసి గౌతమ్, ప్రశాంత్ అవాక్కయ్యారు. శుభశ్రీ- ధామిని చపాతీలు చేస్తుంటే మధ్యలో దూరింది రతిక. తర్వాత శుభ శ్రీ, రతిక మధ్య గొడవ జరిగింది.
షకీలా గురించి నోటికి వచ్చినట్లు వాగి నాలుకుకరుచుకుంది రతిక. దీంతో సైలెంట్‌గా షకీలా దగ్గరికి వచ్చి సారీ చెప్పింది. మన్నించండి అమ్మా అంటూ రతిక చెప్పగా షకిలా కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. చివరికి షకీలా కాళ్లు మొక్కి సారీ చెప్పింది రతిక. తర్వాతి రోజు రెండవ పవరాస్త్ర కోసం పోటీ పడేందుకు ఒక పోటీదారుడ్ని ఎంచుకునే అవకాశాన్ని బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు కల్పించారు. మళ్లీ అడిగినప్పుడు ఒకరి పేరు చెప్పాలని సందీప్‌కి చెప్పాడు బిగ్‌బాస్. తర్వాత బిగ్‌బాస్ ఒకరి పేరు చెప్పమనడంతో బాగా ఆలోచించి సందీప్ మాస్టర్ పైకి లేచాడు. పవరాస్త్ర కోసం పోటీ పడటానికి అమర్ అయితే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. దీంతో రెండో పవరాస్త్ర సాధించడానికి శివాజీ, షకీలాతో పాటు అమర్ కూడా పోటీ పడతాడు అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు.
తర్వాత రతిక – యావర్ మధ్య లవ్ ట్రాక్ ఆకట్టుకుంది. రతికను చూస్తూ ఐ లైక్ యూ రతిక అని యాపర్ చెప్పగా వెంటనే సేమ్ టూ యూ అని చెప్పేసింది రతిక. వీరిద్దరూ అమర ప్రేమికుల్లా తెగ చూసేసుకున్నారు. తర్వాత పవరాస్త్ర సాధించాలంటే ఈ టాస్క్‌లో గెలవడానికి కంటెండర్స్‌లో అందరికంటే పెద్ద గొంతు మీదేనని నిరూపించుకోవాలి.. గార్డెన్‌లో ఉన్న చెవిలో బిగ్‌బాస్ అని గట్టిగా అరవాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఈ పోటీలో విజేత ఎవరనేది నాగార్జున ప్రకటించనున్నారు.
Also Read:గిల్ సెంచరీ వృథా…భారత్‌పై బంగ్లా గెలుపు