బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 91 రోజులు పూర్తి చేసుకుంది. మరో రెండు వారాల్లో బిగ్ బాస్ ముగియనుండగా వీకెండ్ కావడంతో వచ్చిన నాగార్జున..ఓటింగ్ – ఎలిమినేషన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఓటింగ్‌కి ఎలిమినేషన్‌కి సంబంధం లేదని కుండ బద్దలు కొట్టారు.
ఈ సీజన్-7 టైటిల్ విన్నర్‌కి రూ. 50 లక్షల ప్రైజ్ మనీతో పాటు మారుతీ సుజుకీ బ్రెజా కారును గిఫ్ట్‌గా ఇవ్వడంతో పాటు రూ. 15 లక్షల విలువైన జువెలరీ కూడా విన్నర్‌కే దక్కుతుందని నాగార్జున అనౌన్స్ చేశారు. ఇక గెలిస్తే ఆ డబ్బును ఏం చేస్తారు అని ప్రతీ కంటెస్టెంట్‌ని అడిగారు నాగార్జున. ముందుగా గౌతమ్ తన అమ్మకి ఇస్తానని… కొవిడ్ సమయంలో చాలా లోన్స్ తీసుకోవాల్సి వచ్చింది.. అవి తీర్చడానికే వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకోమన్నా తీసుకోకుండా కష్టపడుతున్నారని చెప్పారు.
తర్వాత ప్రశాంత్….రూ.50 లక్షలు పేద ప్రజలకి, రైతులకి పంచిపెడతాను సార్.. పైసల కోసం రాలేదు సార్.. పేరు కోసమే ఇక్కడికి వచ్చా.. ప్రాణం మీద ఒట్టేసి చెబుతున్న పేద రైతులకి మాత్రమే ఈ డబ్బు ఖర్చు చేస్తా అని చెప్పాడు. ప్రియాంక మా అమ్మకి ఇల్లు కట్టి ఇస్తానని చెప్పగా యావర్ లోన్లు చాలా ఉన్నాయి వాటిని పూర్తి చేస్తానని చెప్పాడు.
శోభా అయితే నా లైఫ్‌లో లక్ష రూపాయల చెక్ చూసింది తెలుగు సీరియల్‌లో యాక్ట్ చేసినప్పుడే సార్.. అయితే సీరియల్స్‌లో చేస్తే బతకాడానికి సరిపోయే డబ్బు వస్తుంది.. కానీ నా ఇంటి లోన్ క్లియర్ చేయాలంటే ఈ డబ్బు కావాలని చెప్పింది. శివాజీ డబ్బుపై ఆశలేదు…ఫైనాన్షియల్‌గా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు.. ఇది వస్తే ఆలోచించాలి ఏం చేయాలో అని సమాధానమిచ్చాడు.
Also Read: