Bigg Boss 7:మిత్రుడి కంటే తెలిసిన శత్రువే బెటర్

48
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 85 రోజులు పూర్తి చేసుకుంది. ఇక 13వ వారం సోమవారం కావడంతో నామినేషన్స్ ప్రక్రియ ప్రారంభం కాగా శివాజీ దెబ్బకు అర్జున్‌కు దిమ్మ తిరగగా ప్రశాంత్ కూడా శోభాకు పంచ్ ఇచ్చాడు. తొలుత ప్రశాంత్‌తో నామినేషన్స్ ప్రక్రియను ప్రారంభించారు బిగ్ బాస్. తొలుత శోభా శెట్టిని నామినేట్ చేస్తూ… లాస్ట్ వీక్ నన్ను కెప్టెన్సీ టాస్కులో నుంచి ఫస్టే నువ్వు తీసేసినవ్ అది నాకు నచ్చలేదు అని చెప్పాడు. రెండో నామినేషన్‌ ప్రియాంకకి వేశాడు. గత వారం శోభాని డెడ్ అవ్వకుండా నువ్వు కాపాడావ్ చెవిలో చెప్పి అది నాకు నచ్చలేదని చెప్పాడు. ఇక తర్వాత వచ్చిన గౌతమ్ తొలుత ప్రశాంత్‌ని నామినేట్ చేస్తూ… ఎవిక్షన్ పాస్ గెలిచేంత వరకూ నువ్వు చాలా యాక్టివ్‌గా గేమ్ ఆడావ్.. కానీ ఆ తర్వాత పెద్దగా పార్టిసిపేట్ చేయలేదని రీజన్ చెప్పాడు. రెండో నామినేషన్‌ శివాజీని సెలక్ట్ చేశాడు. మీతో నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నా అంటూ మొదటి వారం నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. ఎన్నిసార్లు చెబుతావురా బాబు.. ఫస్ట్ నుంచీ ఇదే చెబుతున్నావ్ అంటూ శివాజీ అన్నాడు.

తర్వాత ప్రియాంక.. శివాజీని నామినేట్ చేసింది. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతాను.. నేను ఇంతే అని మీరు నా మీద నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు. అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ రీజన్ చెప్పింది. తర్వాత తన రెండో నామినేషన్‌ ప్రశాంత్‌కి వేసింది. నీ గేమ్ ఇంప్రూ అవ్వడానికి నువ్వు ఏం చేయడం లేదు.. ఒక్క చోటే ఉండిపోతున్నావ్ అంటూ రీజన్ చెప్పింది. ఇక అర్జున్‌ ఫస్ట్ నామినేషన్‌గా శివాజీని రెండో నామినేషన్‌ ప్రియాంకని ఎంచుకున్నాడు.

నామినేషన్స్ మధ్యలో బ్రేక్ దొరకగా అమర్‌తో శివాజీ ఓ డైలాగ్ వేశాడు. ఇది మనోడికి (అర్జున్‌కి) మైనస్ అవుద్దిరా.. ఎందుకంటే తన కోసం స్టాండ్ తీసుకున్నప్పుడే తను వద్దు అన్నా అని చెప్పాల్సింది. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు… అక్కడే చెప్పేసి ఉంటే నువ్వు ఈ పాటికి కెప్టెన్ అయిపోయేవాడివి కదా అన్నాడు. ఇక మరోవైపు శివాజీ గురించి ప్రియాంక-గౌతమ్ కాసేపు గుసగుసలాడుకున్నారు. ఇక తనకు ఛాన్స్ రాగానే శివాజీ తొలుత అర్జున్‌ని నామినేట్ చేశాడు. ఆ రోజు నాగ్ సార్ ముందు నువ్వు ఈ ఫ్రెండ్‌షిప్ బ్యాండ్ నాకు వేస్తే నేను నిజం అనుకున్నాను.. కానీ నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసిన తర్వాత కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదు అంటూ ఆ బ్యాండ్ తీసి జేబులో పెట్టుకున్నాడు. నిజానికి నువ్వు గేమ్ కోసమే ఇక్కడికి వచ్చావ్.. ఫ్రెండ్ షిప్ కోసం కాదు అనుకో.. కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు.. నీకు కెప్టెన్ కావాలనే ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు మొదట్లోనే నాకు చెప్పేస్తే అంత డిస్ట్రబెన్స్ అవ్వకపోయేది అన్నాడు ఆ పాయింట్ ఫస్ట్ మీతో అయిపోతుందేమో అనుకున్నా.. కానీ తర్వాత యావర్ కూడా అదే పాయింట్ మీద నాకు సపోర్ట్ చేశాడు. అంటూ అర్జున్ కవర్ చేశాడు. మిత్రుడి కంటే తెలిసిన శత్రువే బెటర్ అని నువ్వు అన్న ఆ మాట నాకు ఇప్పుడు అనిపిస్తుంది అంటూ అర్జున్‌కు ఇచ్చిపడేశాడు శివాజీ.

Also Read:Modi:బీజేపీని మోడీ బతికిస్తారా?

తన రెండో నామినేషన్ గౌతమ్‌కి వేశాడు శివాజీ. నాకు నీతో ఏ పాయింట్లు లేవురా.. నువ్వు కావాలని ప్రతి వారం నాతో పెట్టుకుంటున్నావ్ అంతే అందుకే వేస్తున్నానని గౌతమ్ అన్నాడు. SPY ఎక్కడిది అన్నా.. అంటూ గౌతమ్ అడిగాడు. నేను పెట్టానా ఏంటి కంపెనీ ఏమైనా ఆ పేరుతో.. నన్ను అడుగుతావ్ ఏంటి అంటూ శివాజీ ఫైర్ అయ్యాడు. నేను ఎవరైతే వీక్‌గా ఉంటారో, జెన్యూన్‌గా ఉంటారో వాళ్లకి సపోర్ట్‌గా నిలబడతానని అన్నా.. అంటూ శివాజీ క్లారిటీ ఇచ్చాడు. చివరిగా శోభా వంతు వచ్చింది. ఫస్ట్ ప్రప్రశాంత్‌ని ,రెండో నామినేషన్ యావర్‌కి వేసింది శోభా శెట్టి. మొత్తంగా హౌస్ ఉన్న 8 మందిలో ఒక్క అమర్‌దీప్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

- Advertisement -