Bigg Boss 7 Telugu:ఆసక్తికరంగా క్రైమ్ టాస్క్

59
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 80 రోజులు పూర్తి చేసుకుంది. తన భార్యను హౌస్‌లో ఎవరో హత్య చేశారన ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేయాల్సిన బాధ్యతను అర్జున్, అమర్‌లకి అప్పగించాడు బిగ్‌బాస్. దీంతో పోలీస్ గెటప్‌లో ఇద్దరూ రెడీ కాగా కన్ఫెషన్ రూమ్‌కి పిలిచి బిగ్‌బాస్ కొన్ని సలహాలు ఇచ్చాడు. అనుమానం ఉన్న వారందరిని విచారించి తర్వాత ఆధారాలు, కారణాలను బట్టి మూడు సార్లే నిందితులుగా పరిగణించి జైలులో వేయొచ్చు అని సూచించారు.

ఒక వేళ మీ అనుమానం రాంగ్ అయితే మీరు అవకాశం కోల్పోయినట్లేనని…అశ్విని, శోభాలను పార్టీలో ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన రిపోర్టర్లుగా వ్యవహరించాలని, బ్రేకింగ్ న్యూస్ కోసం వెతుకుతూ ఇద్దరూ పోటీ పడాలని రోల్ ఇచ్చాడు. యావర్, ప్రియాంకలు బ్రదర్ అండ్ సిస్టర్లుగా సహాయకులని చెప్పాడు. ఇక రతికకి డ్రైవర్ రోల్ ఇచ్చాడు. తోటమాలి గెటప్‌లో గౌతమ్ …ప్రశాంత్‌కి వంటోడి పాత్ర ఇచ్చాడు.

తర్వాత శివాజీని కన్ఫెషన్ రూమ్‌కి పిలిచాడు బిగ్‌బాస్. శివాజీ ముందు కాఫీని ఆస్వాదించండి.. మీరు బీబీ మేన్షన్‌ని అంతా తన గుప్పిట్లో పెట్టుకొని అందరి చేత పని చేయించే స్ట్రిక్ట్ మేనేజర్ అంటూ ఎదురుగా పోలీసులు వెతుకుతున్న నెక్సెస్‌ను కూడా ఉంచాడు బిగ్‌బాస్. ఈ సీజన్ మొదటి సీక్రెట్ టాస్క్ మీదే.. అర్జున్, అమర్ వెతుకుతున్న మర్డరర్ మీరే.. వారికి దొరక్కుండా మీరు మరిన్ని మర్డర్స్ చేయాల్సి ఉంటుంది…ఎవరూ ఫోన్‌ను కనుక్కోకుండా పట్టుకోకుండా చూసే బాధ్యత మీదే అంటూ చెప్పాడు. దీంతో కోటు సూటు వేసకొని మేనేజర్ గెటప్‌లో దిగిపోయాడు శివాజీ.

డ్రైవర్ రతిక.. తోటమాలి గౌతమ్ లవర్స్ కావడంతో ఇద్దరూ ప్రేమలో మునిగిపోయారు. మరోవైపు హంతకుడ్ని కనిపెట్టే పనిలో అమర్, అర్జున్ తిరుగుతూ ఉన్నారు. వీళ్లని విసిగిస్తూ బ్రేకింగ్ న్యూస్ రాబట్టడానికి శోభా, అశ్వినీ చేయని ప్రయత్నం లేదు. ఫోన్ పట్టుకొని బాత్రూంలో బిగ్‌బాస్‌తో మాట్లాడాడు శివాజీ. మీరు ప్రశాంత్‌ని మర్డర్ చేయాల్సి ఉంటుంది.. ఇందుకోసం ప్రశాంత్ మొక్కని ఎవరికీ కనబడకుండా పోస్ట్ బాక్స్‌లో పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాడు బిగ్ బాస్.

దీంతో వెంటనే వెళ్లి ప్రశాంత్‌ను సైలెంట్‌గా స్టోర్ రూమ్‌లో దాక్కోమని శివాజీ సీక్రెట్‌గా చెప్పాడు. దీంతో ఏంటి అని అడక్కుండానే ప్రశాంత్ స్టోర్ రూమ్‌లోకి వెళ్లాడు.. వెంటనే బిగ్‌బాస్ డోర్ లాక్ చేశాడు. నేను చెప్పేంత వరకు నువ్వు బయటికి రావద్దు.. స్టోర్ రూమ్‌లోనే ఉండాలి అంటూ చెప్పి శివాజీ అందరి దగ్గరికీ వెళ్లిపోయాడు. చాలా సేపటిగా ప్రశాంత్ కనిపించకపోయేసరికి అందరూ ఇల్లంతా వెతికారు. అమర్‌దీప్ తెలివిగా స్టోర్ రూమ్ లాక్ చేసుందని కిందకి తొంగి చూశాడు. అక్కడ ప్రశాంత్ చెప్పులు కనిపించేసరికి లోపలే ఉన్నాడంటూ అందరినీ పిలిచేశాడు. ఇక అందరూ వచ్చేయడంతో డోర్ లాక్ తీసేశాడు బిగ్‌బాస్. మొత్తంగా ఆసక్తికరంగా ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది.

Also Read:చలికాలంలో కీరదోస తింటే ఎన్నో ప్రయోజనాలో..!

- Advertisement -