Bigg Boss 7 Telugu:నిన్న ఫ్రెండ్స్..ఇవాళ శత్రువులు

73
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 78 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా సాగింది. ఒక్క రోజు ముందే ప్రశాంత్ తన కొత్త ఫ్రెండ్ అని చెప్పిన గౌతమ్ 24 గంటల తర్వాత ఫస్ట్ నామినేషన్ ప్రశాంత్ అని చెప్పాడు. ఎవిక్షన్ పాస్‌కి సంబంధించిన ఓ గేమ్‌లో శివాజీ, యావర్‌లు ఫౌల్స్ చేసినా నువ్వు సంచాలక్‌గా వాళ్లని తప్పించలేదు అందుకే నామినేట్ చేస్తున్నానంటూ గౌతమ్ చెప్పాడు. అసలు ఇది పాయింటే కాదని ప్రశాంత్ చెప్పడంతో గొడవ స్టార్ట్ అయింది. నేను వేసిన పాయింట్ పాయింటే కాదు అనడానికి నువ్వెవరు.. నువ్వు కత్తి పొడిచినప్పుడు రక్తం వస్తుంది కదా అని గౌతమ్ అనగా నిన్ను పొడుస్తా అన్నా.. నాకేం తీట అంటూ ప్రశాంత్ కౌంటరిచ్చాడు.

తర్వాత ప్రశాంత్ కూడా గౌతమ్‌ని నామినేట్ చేస్తూ కెప్టెన్సీ రేసు నుంచి ఫస్టే ఎందుకు తీసేశావ్ అన్నా.. నేను కష్టపడ్డా అని చెప్పాడు. ప్రియాంకని కెప్టెన్ చేద్దామని నేను అలా చేశా.. అయినా నిన్ను తప్పించాలని అందరికీ వెళ్లి చెప్పలేదు కదా.. అంటూ గౌతమ్ అన్నాడు. సంచాలక్‌గా నేను సరిగా చూడలేదు అన్నావ్.. ఆ గేమ్‌కి ఇంకొక (శోభా) సంచాలక్ కూడా ఉన్నారుగా.. వాళ్లకి ఎందుకు వేయలేదు అనగా సిల్లీ రీజన్ చెప్పి కవర్ చేశాడు.

అందుకే అది సేఫ్ గేమ్ అని ప్రశాంత్ చెప్పగా డైరెక్ట్ వచ్చి గుద్దుతా సేఫ్ ఆడేది లేదు ఇక్కడ.. ప్రశాంత్ అంటే రివెంజ్ నామినేషన్.. నా పంచె ఆనవాయితీ లెక్క నీకు కూడా రివెంజ్ ఆనవాయితీ అని గౌతమ్ చెప్పగా ఆ పంచె ఊడిపోకుండా కాపాడుకో.. పంచెకి ఇజ్జత్ ఇయ్ కౌంటర్ ఇచ్చాడు ప్రశాంత్. ఈ క్రమంలో గౌతమ్ కాస్త ఎక్కువే చేశాడు. ప్రశాంత్ అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.

తర్వాత రతికను నామినేట్ చేశాడు ప్రశాంత్. రతికతో మాట్లాడుతుంటే మధ్యలో దూరి గౌతమ్ వాగుతూనే ఉన్నాడు. దీనికి పేరే రివెంజ్ నామినేషన్ అంటూ అరిచాడు. అందుకే రెండు విటమిన్ గోళీలు వేసుకొని చప్పరిచ్చు అని ప్రశాంత్ కౌంటర్ వేశాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు మళ్లీ పెరిగి ప్రశాంత్‌కి తిక్క రేగి నేనేమన్నా విప్పేసి తిరుగు అన్నానా.. నేను పంచె కట్టుకొని రాలేదా ఇంతకుముందు కళ్లు కనిపీయ లేదా అంటు చురకలు వేశాడు.

Also Read:Sethakka:సీతక్క కు ఓటమి తప్పదా?

- Advertisement -