Bigg Boss 7 Telugu:శివాజీకి లెఫ్ట్ రైట్ ఇచ్చేసిన నాగ్

47
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 76 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్ వీకెండ్ కావడంతో కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ వారంలో జరిగిన విషయాలను అన్ని ప్రస్తావిస్తూ శివాజీ చేసిన తప్పును హైలైట్ చేస్తూ క్షమాపణ చెప్పేలా చేశారు నాగ్. అర్జున్, గౌతమ్‌లు అమర్ దీప్ గురించే మాట్లాడారు. వాడేంట్ఆ అలా ఏడున్నాడు అంటూ దెప్పిపొడవడం స్టార్ట్ చేశారు. గౌతమ్ అయితే అమర్ ఏడ్వడం వాడి స్ట్రాటజీ ఏమో అని…ఇక కెప్టెన్సీ పరంగా అమర్ కంటే ప్రియాంకనే అర్హురాలు అని చెప్పాడు.

తర్వాత నాగార్జున ఇంట్లో వాళ్లతో మాట్లాడుతూ ప్రియాంకతో మొదలుపెట్టారు. ప్రియాంకా నీ ఆట అద్భుతం…నీ ఫ్రెండ్ అయినా కూడా శోభాశెట్టి నిన్ను కొడుతుంటే ఏడ్వకుండా డిఫెండ్ చేసుకున్నావ్ సూపర్బ్ అని చెప్పారు. ఖచ్చితంగా నువ్వు కెప్టెన్సీకి అర్హురాలివి అని చెప్పాడు.తర్వాత శివాజీ వంతు వచ్చేసింది. శివాజీ కెప్టెన్సీ ఎలా ఉంది…మొదటిగా గౌతమ్‌ని అడగడంతో చాలాబాగుంది సార్ అని చెప్పాడు. మిగితా వాళ్లు కూడా బాగుంది అని చెప్పగా ఏంటీ వడలు చేయించడమేనా? అని పంచ్ వేశారు.

గారెలతో మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటూ పంచ్ చేశారు . లేదు సార్.. ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకున్నారు అని గౌతమ్ చెప్పగా నాకు చేయి బాలేనప్పుడు వీళ్లంతా నన్ను బాగా చూసుకున్నారు. తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాను.. అందుకే తిరిగి ఇచ్చేశాను చెప్పారు శివాజీ. అందరిని బాగానే మానిప్యులేట్ చేశావ్ శివాజీ అని అంటే.. ఇది కూడా మానిప్యులేట్ అంటే నేనేం చేయలేను.. నేను ఎవరితోనూ గొడవపెట్టుకోలేదు అన్నాడు.

కెప్టెన్‌గా శివాజీ వెరీ గుడ్ కానీ.. నాకు నీ వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయి అన్నారు. మీకు సమస్య ఉంటే.. ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి బాబు గారూ లేదంటే నాది తప్పైపోద్ది అని చెప్పాడు శివాజీ. మీ అబ్బాయి వచ్చినప్పుడు నీకు ఏం చెప్పాడూ.. ఇంట్లో వాడే పదాలు.. ఇక్కడ వాడొద్దని చెప్పాడు కదా అనగా బూతుల గురించేనా అంటే కరెక్ట్ అన్నాడు నాగ్. నీకు నచ్చినట్టు మాట్లాడతానంటే ఎలా…నువ్వే అంటావ్ కదా.. జనం చూస్తారని ఇవి జనం చూడరా? అని అడిగారు నాగ్. అమర్ ఆడుతుంటే.. పిచ్చి పోహా అన్నావ్.. నీ ఉద్దేశం అని నాగార్జున అడిగారు. ఏం లేదు బాబుగారూ.. మేం రెగ్యులర్‌గా పోహా చేసుకుంటాం.. అందుకే పోహా అన్నాను అన్నాను అని చెప్పాడు.

నువ్వు కొంతమందికి నచ్చదని అంటున్నావ్.. ఆల్ మోస్ట్ ఇవి అందరికీ నచ్చవు.. ఏజ్ విషయం పక్కన పెట్టేయ్.. ఆయన అనుభవంతో మమ్మల్ని బాగా చూసుకున్నారని అర్జున్ చెప్పాడు కదా.. మరి ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? నీ సహనం ఏమైంది? అని ప్రశ్నల వర్షం కురిపించారు నాగ్. చివరకు పొరపాటు అయితే క్షమించండి.. నేను ఇంతకంటే దాని గురించి ఆర్గ్యూ చేయదల్చుకోలేదు అని చేతులెత్తి క్షమించమని దండం పెట్టాడు శివాజీ. శివాజీ నీకు ఆఖరిసారి చెప్తున్నా.. మళ్లీ ఇలాంటి పదాలు వాడొద్దు.. సరదాగా వాడుతున్నానని చెప్పొద్దు.. ఆట చివరికి వచ్చేసింది. నువ్వు అంటే అందరికీ రెస్టెక్ట్.. అది కాపాడుకో అని వార్నింగ్ ఇచ్చాడు.

Also Read:రాత్రి పాతబస్తీలో ప్రత్యక్షమైన మంత్రి కేటీఆర్‌

- Advertisement -