Bigg Boss 7 Telugu:ఫ్యామిలీ వీక్..అదుర్స్

42
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 65 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఫ్యామిలీ ఎపిసోడ్‌ గా మార్చేశారు బిగ్ బాస్. దీంతో ఎమోషన్‌తో కుటుంబ సభ్యులను చూసి కన్నీటిని ఆపుకోలేకపోయారు. ఈ వారం హౌస్‌లో ఏం చేయాలనే దానిపై బిగ్‌బాస్ ఎపిసోడ్ ముందే క్లారిటీ ఇచ్చేశాడు. ఈ వారం అందరినీ ఎంటర్‌టైన్ చేసేందుకు హౌస్ బీబీ కాలేజ్‌గా మారుతుంది. ఇక్కడ అందరూ స్టూడెంట్స్‌గా మారాల్సి ఉంటుంది. మీలో నుంచే కొంతమంది లెక్చరర్లుగా మారి అప్పుడప్పుడు కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేస్తారు.. ఈ ప్రక్రియలో వీలైనంత ఎక్కువ ఎంటర్‌టైన్ చేయడం మీ లక్ష్యం.. అంటూ బిగ్‌బాస్ చెప్పాడు.

తర్వాత శివాజీని మెడికల్ రూమ్‌కి పిలిచారు బిగ్ బాస్. అక్కడ ముఖానికి మాస్కు..హెడ్ క్యాప్, స్పెట్స్, కోటు అన్నీ వేసుకొని ఒక డాక్టర్ ఉన్నారు. శివాజీ రాగానే హార్ట్ కైసే హే అంటూ అడగ్గా అచ్చా హే.. అని శివాజీ చెప్పగానే ఎక్సర్‌సైజులు చేస్తున్నారా.. బాగా పడుకుంటున్నారా.. అని డాక్టర్ అడిగాడు. ఇంతలో నాన్న అంటూ డాక్టర్ పిలవడంతో షాకై ఏంటి. అంటూ శివాజీ వెనక్కి తిరిగాడు. మాస్కు, క్యాప్ అన్నీ తీసి నిల్చోగానే శివాజీ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఏడవకు నాన్న వద్దు నాన్న ఏడవకు హెల్త్ బాలేనప్పుడు ఏడవకు అంటూ తన కొడుకు చెప్పడంతో శివాజీ ముద్దు పెట్టి తెగ మురిసిపోయాడు. అనంతరం తన కొడుకును తీసుకొని హౌస్‌లోకి వెళ్లాడు శివాజీ.ప్రశాంత్ తో శివాజీ కొడుకు బాగా మాట్లాడాడు. ​థ్యాంక్స్ అన్నా.. నాన్నని బాగా చూసుకుంటున్నందుకు అన్నాడు. ఇక యావర్ అన్న ఇంకా అలిగాడా అంటూ శివాజీతో అనగానే లేదు లైన్‌లోకి వచ్చాడు అంటూ యావర్‌ని పిలిచాడు శివాజీ. థ్యాంక్స్ అన్నా చేతికి దెబ్బ తగిలినప్పుడు మీరు చాలా బాగా చూసుకున్నారు అని చెప్పాడు.తర్వాత కొడుకు అందరికీ బైబై చెప్పి బయటికెళ్లిపోయాడు.

తర్వాత అర్జున్ భార్య సురేఖ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భార్యని చూసిన వెంటనే అర్జున్ పరిగెత్తుకొని వెళ్లి గట్టిగా పట్టుకొని ఎమోషనల్ అయిపోయాడు. తర్వాత తన భార్య అడిగిన ప్రశ్నలకి అర్జున్ సమాధానమిచ్చాడు. ఇక కాసేపటికి హౌస్‌లో ఉన్నవాళ్లందరినీ ఫ్రీజ్ అంటూ బిగ్‌బాస్ చెప్పాడు. సడెన్‌గా హౌస్‌లోకి అశ్విని తల్లి ఎంట్రీ ఇచ్చారు. తల్లిని చూడగానే ఏడుపు ఆపుకోలేకపోయింది అశ్విని.ఒక్కోసారి అనిపిస్తుంది.. అన్నీ వదిలేసి వచ్చేయాలని.. కానీ నన్ను నేను ప్రూ చేసుకోవాలని ఇక్కడ ఉన్నానని తెలిపింది. వెళ్లేటప్పుడు భోలేని పట్టుకొని అశ్విని తల్లి చాలా ఎమోషనల్ అయ్యారు.

Also Read:మ్యాక్స్‌వెల్ డబుల్‌ సెంచరీ..ఆసీస్ అద్భుత విజయం

- Advertisement -