Bigg Boss 7:మోనిత కోసం యుద్ధం చేసిన అమర్

59
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. కెప్టెన్సీ టాస్క్‌లో ఓవరాక్షన్ చేసిన అమర్…చివరికి శివాజీ కాళ్లు మొక్కాడు. తొలుత బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని బిగ్ బాస్ అడగ్గా గౌతమ్ మా దగ్గరుందని చెప్పడంతో బిగ్‌బాస్ అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు. బ్లాక్ బాల్ మీ దగ్గర ఉన్న కారణంగా మీకు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని… మీ ప్రత్యర్థుల దగ్గరున్న మొత్తం అన్ని బాల్స్‌ను మీ దగ్గరున్న బాల్స్‌తో స్వాప్ చేసుకోవాలని తెలిపాడు. దీంతో గౌతమ్ ఎగిరిగంతేయగా మా పని అయిపోయిందని శివాజీ తనలో తానే తిట్టుకున్నాడు.

కెప్టెన్సీ కంటెండర్ల కోసం ప్రతి కంటెండర్ వారి సంచిని మోసేందుకు ఒకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది.. మిగతా కంటెండర్స్ సంచిని వీలైనంత త్వరగా ఖాళీ చేయడం.. రౌండ్ ముగిసే సరికి ఎవరి సంచి తక్కువ ఉంటే వాళ్లు ఎలిమినేట్ అంటూ బిగ్‌బాస్ ప్రకటించాడు. దీనికి ప్రశాంత్‌ను సంచాలక్‌గా పెట్టగా బ్యాగులు ఆరు ఉండగా మోసేవాళ్లు మాత్రం ఐదుగురే ఉన్నారు. దీంతో కంటెండర్లలో ఒకరిని తప్పించాల్సి ఉంటుందని చెప్పాడు. దీంతో ఫస్ట్ కెప్టెన్ గౌతమ్‌ని తీసేద్దామనుకుంటున్నాం.. అంటూ శివాజీ వాళ్ల టీమ్ మెంబర్లతో చెప్పాడు. కానీ అశ్విని ఆలోచించి చెబుతానంటూ పక్కకి వెళ్లి గౌతమ్‌ చెవిలో ఈ విషయం ఊదేసింది. అయితే తర్వాత యావర్ రేసు నుండి తప్పుకున్నాడు.

అర్జున్ కోసం శివాజీ, రతిక కోసం భోలే, శోభా కోసం అమర్, తేజ కోసం ప్రియాంక, గౌతమ్ కోసం అశ్విని తమ భూజాన సంచులు వేసుకొని ఆటకి సిద్ధమయ్యారు. ఇక బజర్ మోగినప్పటి నుండి అమర్.. భోలేని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. తర్వాత గేమ్ నుండి అశ్విని ఔట్ కాగా గౌతమ్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత భోలేని టార్గెట్ చేశారు ప్రియాంక-అమర్. సంచాలక్‌గా ఉన్న ప్రశాంత్ చాలా సార్లు ఫిజికల్‌గా కొట్టుకోకండి అంటూ అరిచినా సరే అమర్ వినలేదు. తర్వాత భోలే కూడా ఎలిమినేట్ అయిపోయాడు. ఇక తర్వాత మిగిలింది శివాజీ-ప్రియాంక-అమర్ మాత్రమే. ఇక మూడో రౌండ్ మొదలయ్యేసరికి శివాజీ చేయి బాలేకపోవడంతో కొంచెం రింగ్ బయటికి వెళ్తూ ఆడాడు. దీంతో మళ్లీ లోపలికి రమ్మని ప్రశాంత్ చెప్పడంతో అలానే వచ్చాడు. కానీ అమర్ ఏమాత్రం చూడకుండా శివాజీ చేయి లాగేసి బ్యాగ్ కింద పడేశాడు. దీంతో శివాజీ విలవిలలాడుతూ పక్కకి వెళ్లిపోయాడు. గౌతమ్ తన దగ్గరున్న కెప్టెన్ బ్యాడ్జ్ తీసి శోభాకి పెట్టాడు. దీంతో శోభా విన్నింగ్ స్పీచ్ ఇచ్చింది. ఈ బ్యాడ్జ్ అమర్ నీకే డెడికేట్ చేస్తున్నా.. ఈ హౌస్‌లో నాకు ఏది అవసరం ఉందో అది నువ్వు నాకు ఇచ్చావ్.. నేను వెళ్లేలోపు నీకు ఏది అయితే అవసరం ఉందో అది నేను ఇస్తా.. అంటూ శోభా తెలిపింది. మొత్తంగా మోనితను కెప్టెన్‌ చేయడానికి అమర్‌ పెద్ద కష్టమే పడ్డాడు.

Also Read:బీఆర్‌ఎస్‌ గెలుపే లక్ష్యంగా ఎన్నారైల ప్రచారం..

- Advertisement -