Bigg Boss 7 Telugu:ఈ సారి నామినేషన్స్‌ కామెడీనే

20
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 57 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తొమ్మిదోవారం నామినేషన్స్ ఫన్నీగా సాగింది. ఒక్కొక్కరు అనర్హూలని భావించే ఇద్దరిని నామినేట్ చేయాలని.. వారిని డ్రాగన్ స్నేక్ దగ్గరికి వచ్చి నిలబెట్టాల్సి ఉంటుందని చెప్పాడు. తొలుత వచ్చిన ప్రశాంత్ …అమర్, తేజలని నామినేట్ చేశారు. ఈ సందర్భంగా ప్రశాంత్ – అమర్‌లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

తర్వాత ప్రియాంక.. రతిక, భోలేని నామినేట్ చేసింది. వైల్డ్ కార్డ్‌లో వచ్చావ్.. బాంబ్‌లా ఆడతావ్ అనుకున్నా.. కానీ అంచనాలు అందుకోలేదు అని తన రీజన్ చెప్పింది..ఇక తన పేరు చెప్పగానే భోలే ర్యాగింగ్ మొదలుపెట్టాడు. యస్ ప్రియాంక.. అటెండెన్స్.. అంటూ లేచి నిల్చున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటల యుద్దం జరిగింది. అర్జున్.. శోభా,అమర్‌ని నామినేట్ చేశాడు. మొత్తం 8 వారాల్లో నువ్వంటే ఓ మార్క్.. తప్పు చేయను నేను.. కరెక్ట్‌గా ఉంటాను.. తప్పు చేస్తే సారీ చెబుతాను.. ఇలా ఇవన్నీ నువ్వు చెప్పిన మాటలే కానీ లాస్ట్ వీక్ నీకు తెలుసో తెలియకో ఆ మార్క్ అయితే పోయిందని శోభా గాలి తీసేశాడు. తర్వాత అమర్‌ని నామినేట్ చేస్తూ … శోభా నేను ఒక్కదాన్నే కనిపించానా అంటది.. కానీ దానికి కారణం నువ్వే కదా అంటూ అమర్‌తో అన్నాడు అర్జున్. అది నా తప్పే ఒప్పుకుంటున్నా.. దీన్ని ఎక్కువ లాక్కూడదన్నా.. దరిద్రం నాకే పడతాది.. పొమ్మంటే నేను పోతా అక్కడికి పబ్లిక్‌లో ఒప్పుకున్న దాన్ని తీసుకొచ్చి నామినేషన్స్‌లో వేస్తున్నావ్ అని తెలిపాడు అమర్.

ఇక శివాజీ…అమర్‌,తేజని నామినేట్ చేశాడు. లాస్ట్ టైమ్ నామినేషన్ టైమ్‌లో ప్రశాంత్.. ప్రియాంకని చేశాడని నేను మీ ఇద్దరినీ చేశానంటూ నువ్వు చెప్పావ్.. అని శివాజీ అన్నాడు. లేదు అన్నా నేను అలా అనలేదని అమర్ అనడంతో కాదు అన్నావ్.. లేకపోతే నిన్ను అబద్ధం చెప్పి నామినేట్ చేసేంత చిల్లర యవ్వారం నేను చేయను అని తన రీజన్ చెప్పాడు. బాగా ఆడే సందీప్‌ని నామినేట్ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి ఒక కారణమయ్యావ్‌రా అంటూ తేజని నామినేట్ చేశాడు శివాజీ.

రతిక…ప్రియాంక,శోభాని నామినేట్ చేసింది. నేను బాంబ్‌లాగ ఆడలేదు అన్నావ్ కదా ఆ పదం నాకు నచ్చలేదు అంటూ రతిక చెప్పింది. తర్వాత ఫౌల్ గేమ్ ఆడావ్ అంటూ శోభాని నామినేట్ చేసింది. ఇక అర్జున్ ని నామినేట్ చేస్తూ కామెడీ చేశాడు తేజ. తర్వాత రతికని నామినేట్ చేశాడు తేజ. తర్వాత భోలే వచ్చి ఒక పాట పాడి డైలాగ్ కొట్టాడు. పాత సామాన్లు అమ్ముకొని అయినా బతకొచ్చు కానీ ఇంట్లో చికాకు ఉంటే బతకలేం.. ఒక తప్పు జరిగినప్పుడు దానిని యాక్సెప్ట్ చేయకపోతే ఆ కిరికిరి అలా నడుస్తూనే ఉంటది.. నన్ను క్షమించావా.. అంటూ శోభాని అడిగాడు భోలే. ప్రియాంక, అమర్‌దీప్‌ని నామినేట్ చేశాడు భోలే.

Also Read:శ్రీలంకపై అఫ్గాన్‌ ఘనవిజయం

- Advertisement -