Bigg Boss 7 Telugu:శోభాశెట్టి అరాచకం

18
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 54 రోజులు పూర్తి చేసుకుంది. ఇక తాజా ఎపిసోడ్‌లో భాగంగా కెప్టెన్సీ టాస్క్ ఆసక్తికరంగా సాగగా శోభాశెట్టి అరాచకంతో ప్రేక్షకులు సైతం విసిగిపోయే పరిస్థితి నెలకొంది. తొలుత భోలేపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడింది శోభా. అసలు నువ్వు మనిషివేనా? అన్నమే తింటున్నావా? అని అనగా అది కాదురా చెల్లెమ్మా? అలా అనొద్దురా? అని భోలే అంటే.. ఛీ ఛీ నీకు చెల్లెమ్మని ఏంటి? రా.. ఏంటి? పేరు పెట్టి పిలువు.. నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుందని మండిపడింది.

కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చారు. కెప్టెన్సీ పోటీదారుల్లో ఎవరైతే అనర్హులు అని అనుకుంటారో వాళ్ల మెడలో మిర్చి దండం వేయాలని టాస్క్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి మెడలో అయితే ఎక్కువ మిర్చి దండలు ఉంటాయో వాళ్లు కెప్టెన్సీ రేస్ నుంచి తప్పుకుంటారని ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. దీంతో పోటీదారులుగా ఉన్న వాళ్లు.. ఇంటి సభ్యుల దగ్గరకు వెళ్లి.. దండ వేయొద్దని బ్రతిమిలాడుకున్నారు.

అమర్ దీప్.. ప్రశాంత్ మెడలో మిర్చి దండ వేయగా తర్వాత టేస్టీ తేజా కూడా.. ప్రశాంత్ మెడలో మిర్చి దండం వేసి నువ్వు ఆల్రెడీ కెప్టెన్‌వి అయ్యావ్.. అందుకే వేరే వాళ్లకి అవకాశం ఇద్దాం అనే నిన్ను తప్పిస్తున్నా అని అన్నాడు. శోభా థర్డ్ గేమ్‌లో విన్ అయ్యింది కాబట్టి తనని అన్ అనర్హురాలంటూ రీజన్ చెప్పాడు యావర్. ఒరేయ్.. నెక్స్ట్ టైం నాకు ఛాన్స్ వస్తుంది…..అప్పుడు వేస్తానురా నీలా బక్వాజ్ రీజన్‌తో చేయను. వెయ్ రా వెయ్.. నేనే కెప్టెన్ అవుతా.. నువ్వు చెప్తే నేను మారను. నన్ను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. నీ ముందు నేను గెలిచాను. నేను ఇలాగే ఉంటా బరాబర్.. నాలో టాలెంట్ ఉంది.. అందుకే ఇక్కడికి వచ్చాను అని తెలిపింది. ఈక్రమంలో యావర్ – శోభా శెట్టి మధ్య పెద్ద గొడవ జరిగింది.

తర్వాత ఏడ్వడం స్టార్ట్ చేసింది శోభాశెట్టి. బక్వాజ్ రీజన్ ఏంట్రా అని ఏడుస్తుంటే తేజా తెగ ఓదార్చేశాడు. ఆ తరువాత మళ్లీ బజర్ మోగడంతో.. రండ్రా ఎవడు వేస్తాడో వేయండ్రా అంటూ సైకోశోభా రెచ్చిపోవడం స్టార్ట్ చేసింది. తర్వాత రతిక‌తోనూ శోభా గొడవ జరిగింది. తర్వాత అశ్విని.. ప్రియాంక‌ని తప్పించింది. మొత్తంగా ఇంటి సభ్యులందరితో గొడవ పడి శాడిస్టులా ప్రవర్తించింది శోభా.

Also Read:జనవరి 26న …తంగలాన్

- Advertisement -