Bigg Boss 7 Telugu:శోభాశెట్టి వర్సెస్ భోలే

63
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా రతిక రీ ఎంట్రీ ఒక్కరోజే కావడంతో ఆమెకు నామినేషన్స్ నుండి మినహాయింపు ఇవ్వగా భోలే రిక్వెస్ట్ ,శోభా ఓవరాక్షన్ తో ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.

ఇక నామినేషన్స్‌లో భాగంగా శివాజీ…శోభాశెట్టి, ప్రియాంకలను నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరూ శివాజీపై ఫైర్ అయ్యారు. తర్వాత అశ్విని.. శోభాశెట్టి, ప్రియాంకలను ,గౌతమ్.. ప్రశాంత్, భోలేలను ,ప్రియాంక.. భోలే, అశ్వినిలను,సందీప్.. అశ్విని, భోలేలను ,శోభాశెట్టి.. శివాజీ, యావర్ లను నామినేట్ చేసింది.

శోభా శెట్టిని నామినేట్ చేస్తూ ఫొటో పట్టుకొచ్చాడు భోలే. ఆ రోజు నేను ఆ బూతు మాట మాట్లాడిన తర్వాత నిన్ను చాలా సార్లు సారీ అడిగాను.. చాలా సేపు మాట్లాడాను.. సరే అన్నా చికెన్ చేసి పెట్టు.. అంతా అయిపోయింది వదిలేద్దాం అన్నా అని నువ్వు అన్నావ్ కానీ నాగ్ సార్ ముందు మాత్రం నన్ను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పావ్ అని నిలదీశాడు శోభాని. ఫ్యూచర్ గురించి చెప్పొద్దు.. కలలు కనొద్దు.. నీలాంటి మనిషి నా కలలోకే రారు అంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడింది శోభా. ఈ క్రమంలో వీరిద్దరి గొడవ పెద్దదైంది.

Also Read:టైగర్ 3పై సల్మాన్

- Advertisement -