Bigg Boss 7 Telugu:మళ్లీ కెప్టెన్ గా ప్రశాంత్

42
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 39 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా తాజా ఎపిసోడ్‌లో భాగంగా పల్లవి ప్రశాంత్ తిరిగి కెప్టెన్‌గా ఎంపికయ్యారు. బిగ్ బాస్ ఆదేశాల మేరకు అర్జున్, అశ్వినిలు పనిష్మెంట్ ఇవ్వగా గత మూడు రోజులుగా తేజా వాడి పడేసిన చెమట వాసన కొట్టే బ్లాక్ టీ షర్ట్‌ని వేసుకోవాలని శిక్ష వేశారు.తర్వాత ఆటగాళ్లు వర్సెస్ పోటీగాళ్లలో ఎవరు స్మార్ట్ అన్న విషయాన్ని తేల్చడానికి హు ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.

పాపులర్ సినిమా డైలాగ్‌లు, సాంగ్స్, సీన్స్ నుంచి వివిధ రకాల ప్రశ్నలు అడిగారు బిగ్ బాస్. మొదటి రౌండ్‌లో అమర్ దీప్, భోలేలో పోటీ పడగా.. అమర్ దీప్ గెలిచాడు. తేజా, అశ్వినిలు పోటీపడగా తేజా గెలిచాడు. నయని, ప్రియాంకలు పోటీ పడగా నయని గెలిచింది. ఇక ఈ ఎపిసోడ్‌లో విలన్‌గా నిలిచింది శోభా శెట్టి. వరస్ట్‌గా బిహేవియర్‌తో రచ్చరచ్చ చేసింది. బిగ్ బాస్ సైతం శోభా శెట్టినే తిట్టే పరిస్థితి వచ్చింది.
ఆ తరువాత మిర్చి మిర్చి సాంగ్ ప్లే చేశారు. ఇందులో మొత్తం ఎన్ని మిర్చీలు ఉన్నాయ్ అని బిగ్ బాస్ అడగడంతో.. అప్పుడు కూడా రెండు బోర్డ్‌లు పట్టుకుంది శోభా. 9, 13 ఉన్న బోర్డ్‌లను రెండూ పట్టుకుని నిలబడింది. ఇదేంది బిగ్ బాస్.. మళ్లీ రెండు బోర్డ్‌లు పట్టుకుంది.. లాక్కోవాలా? అని గౌతమ్ అడిగితే.. లాక్కో గౌతమ్ లాక్కో అని అన్నది. లాక్కోవడం నావల్ల కాదు.. అది గేమ్ కాదు అని గౌతమ్ అంటే.. నా వల్ల అదే అవుతుంది అని పరమ అసహ్యంగా ఫేస్ పెట్టి థూ అనేట్టుగా ప్రవర్తించింది శోభా. అప్పుడు మళ్లీ బిగ్ బాస్ గడ్డిపెట్టారు.

ఇక చివరి టాస్క్‌లో ఆటగాళ్లు గెలిచారు అని చెప్పగానే ఓవరాక్షన్ చేసింది శోభాశెట్టి. డాన్స్ చేస్తూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించింది.మొత్తంగా ఈ ఎపిసోడ్‌లో విలన్‌గా మారింది శోభాశెట్టి.

Also Read:పాక్ పై గెలవాలంటే..అలా చేయాల్సిందే!

- Advertisement -