Bigg Boss 7 Telugu: కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చ

24
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 30 రోజులు పూర్తి చేసుకుంది.తాజా ఎపిసోడ్‌లో భాగంగా జరిగిన కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చకు దారి తీసింది. కంటెస్టెంట్లు అందరు తమ బెస్ట్ ఫ్రెండ్ (బడ్డీ)ను జోడీగా ఎన్నుకోవాలని, వారితో కలిసే ఈ వారమంతా ఆడాల్సి ఉంటుందని చెప్పాడు.

దీంతో హౌస్‌లో ఉన్న 10 మంది ఐదు జంటలుగా బరిలోకి దిగారు. ప్రియాంక-శోభా శెట్టి,అమర్ దీప్- సందీప్,శివాజీ- ప్రశాంత్,యావర్-తేజ,శుభశ్రీ- గౌతమ్ జంటలుగా విడిపోయారు. వీరికిచ్చిన టాస్క్ ఏంటంటే ఈ వారం మొత్తం జరిగే కెప్టెన్సీ టాస్కుల్లో వీలైనన్నీ ఎక్కువ స్టార్స్ పొందాలి. ఏ జంట దగ్గర అయితే ఎక్కువ స్టార్లు ఉంటాయో వాళ్లు కెప్టెన్సీ ఫైనల్ టాస్క్‌కి కంటెండర్లుగా మారతారని.. మొదటి కెప్టెన్సీ సాధించిన వారు సూపర్ ఇమ్యూనిటీ పొందుతారని చెప్పారు బిగ్ బాస్. అలాగే ఫస్ట్ కెప్టెన్ అయిన వారు ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా ఇమ్యూనిటీ పొందుతారని చెప్పాడు.

ఇక టాస్క్ మొదలైంది. ముందుగా పాకుతూ ఏరుకునే ఓ టాస్క్ పెట్టాడు. ఇదేంటంటే ఐదు జంటల వారి వారి స్మయిలీ బోర్డు వెనక నిల్చొని ఉండాలి. ఆ బోర్డుపై ఉన్న స్మయిలీకి కొన్ని పళ్లు (టీత్) మిస్ అయి ఉంటాయి. బజర్ సౌండ్ వచ్చిన వెంటనే వారి ముందు ఉన్న రెండు పిట్స్ (గొయ్యి)ల్లో ఏర్పాటు చేసిన తాళ్ల కింద నుంచి పాకుతూ యాక్టివిటీ రూమ్‌లోకి వెళ్లాలి. అక్కడ ఉన్న రెండు టబ్స్‌లో స్మయిలీ బోర్డులో మిస్ అయిన పళ్లు (నంబర్లతో రాసి) ఉంటాయి. వాటిని ఏరుకొని తిరిగి వచ్చి ఆ బోర్డులో ఫిక్స్ చేయాలి. ఎవరైతే ఇలా మొత్తం పళ్లు ఫస్ట్ ఫిక్స్ చేసి అక్కడ ఉన్న గంట కొడతారో వాళ్లకి మూడు స్టార్లు, సెంకడ్ వచ్చి గంట కొట్టిన వారికి రెండు స్టార్లు, మూడో స్థానంలో నిలిచిన వారికి ఒక్క స్టార్ వస్తాయని చెప్పాడు. ఈ టాస్క్‌కి యావర్-శోభాలను సంచాలకులిగా నియమించాడు బిగ్‌బాస్.

Also Read:రేపటి నుంచే స్టార్ట్.. వారికి ఇదే చివరి వరల్డ్ కప్?

ఇక బజర్ మోగిన వెంటనే పల్లవి ప్రశాంత్, శివాజీ పాకుతూ పోయి అందరికంటే ముందే ఆ పళ్లు అన్నీ ఫిక్స్ చేసి గంట కొట్టేశారు. శోభా శెట్టి మాత్రం అక్కడ తనకి కావాల్సిన నంబర్లు దొరకకపోయేసరికి దొరికిన నంబర్లు తీసేసి జాకెట్లో దాచేసింది. ఇది చూసిన సందీప్ అదేంటి నీకు అవసరం లేనివి దాచేస్తన్నావ్ ఇచ్చెయ్ అంటూ చెప్పగా రచ్చరచ్చ చేసింది.

సెకండ్ గంట కొట్టింది అమర్-సందీప్ జంట. కానీ వీళ్లు పళ్లు స్మయిల్ బోర్డులో పూర్తిగా ఫిక్స్ చేయకుండానే ఆవేశంగా గంట కొట్టేశారు. కానీ ఆ తర్వాత మొత్తానికి ఫిక్స్ చేసి మళ్లీ కొట్టారు. ఇక తర్వాత శోభా- ప్రియాంక గంట కొట్టారు. ఇక తర్వాత ప్లేస్‌లో గౌతమ్-సుబ్బు రాగా చివరిలో యావర్-తేజ నిలిచారు.

Also Read:6 నుండి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం..

- Advertisement -