Bigg Boss 7:ఆసక్తికరంగా నాలుగో పవరాస్త్ర టాస్క్

19
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 25 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా నాలుగో పవరాస్త్ర కోసం కంటెండర్లకు వింత వింత టాస్క్‌లతో పిచ్చెక్కించారు. నిన్నటి గేమ్‌లో నేను పక్షపాతం లేకుండా ఉన్నాను కాబట్టే కదా అమర్ వాళ్లు గెలిచారు.. నాకు అసలు ఆ ఫీలింగే లేదురా అంటూ ప్రశాంత్‌తో శివాజీ అన్నాడు. ఇక నేను అమర్‌కి సాయం చేస్తున్నానంటూ అస్తమానం నన్ను అంటున్నారుఅని చెప్పుకొచ్చాడు శివాజీ. తర్వాత శివాజీ …యావర్ కోసం ఫుడ్ తీసుకోవడానికి వెళ్లగా ఇంట్లో ఎక్కువగా తింటోంది యావరేనని మొదలు పెట్టాడు సందీప్. ఈ క్రమంలో గొడవ పెద్దదై చివరికి అంతా శివాజీని టార్గెట్ చేసే వరకు వెళ్లింది.

ఆ తర్వాత ప్రశాంత్-యావర్‌తో శివాజీ మాట్లాడాడు. మొత్తం నలుగురు ఐదుగురు ఎగబడతారేంట్రా.. రెండు నిమిషాలు పట్టదు.. ఎత్తి పడేసి పోతా.. అందరినీ అంటూ శివాజీ డైలాగులు కొట్టాడు. అమ్మా అమ్మా అంటే ఎవరూ వినరు.. చూపిస్తా ఈరోజు నుంచి.. రేపటి నుంచి వాళ్లు చేసింది నేను తినను.. నాది నేను చేసుకుంటా అంటూ శివాజీ మండిపడ్డాడు. ఇక ఏటీఎమ్ నుంచి కాసుల సౌండ్ రాగానే ఫస్ట్ యావర్ బజర్ ప్రెస్ చేశాడు. దీంతో తరువాతి టాస్క్ గురించి బిగ్‌బాస్ చెప్పాడు.

Also Read:ప్చ్.. ఆ బ్యూటీ మళ్లీ ఫైరయ్యింది.

కన్నీళ్లలో చిన్న గ్లాస్ నింపాలన్నమాట.. ముందుగా ఎవరు ఫస్ట్ గ్లాసు నింపుతారో వాళ్లు విన్నర్స్. ఈ టాస్క్ వినగానే ప్రశాంత్‌ని తన పార్టనర్‌గా సెలక్ట్ చేసుకున్నాడు యావర్. ఇక ఆపోజిట్ టీమ్‌గా అమర్-గౌతమ్‌ని తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ల దగ్గరే ఎక్కువ కాయిన్స్ ఉన్నాయి. ఈ టాస్క్‌లో యావర్- ప్రశాంత్ టీమ్ గెలిచింది. దీంతో అమర్-గౌతమ్ కాయిన్స్ కూడా వీళ్లకి చేరిపోయాయి. వీటిని ప్రశాంత్ 76 కాయిన్స్, యావర్ 75 కాయిన్స్‌గా పంచుకున్నారు. దీంతో యావర్, ప్రశాంత్‌లు నాలుగో పవరాస్త్ర సాధించేందుకు కంటెండర్లుగా ఎంపిక అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు.

ఈ క్రమంలో బిగ్‌బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకా వీకెండ్‌కి రెండు రోజులు మిగిలిపోవడంతో గాలా ఈవెంట్ ప్లాన్ చేశాడు. దీనిలో భాగంగా కంటెస్టెంట్లు వీలైనంత క్రియేటివిటీగా రెడీ అయి కనిపించాలని చెప్పాడు. అందరిలో ఎవరైతే వినూత్నంగా, విచిత్రంగా, వినోదాత్మకంగా రెడీ అవుతారో వాళ్లను నాలుగో పవరాస్త్ర సాధించేందుకు మూడో కంటెండర్‌గా సెలక్ట్ చేస్తానని చెప్పారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో శుభ శ్రీ విజేతగా నిలవడంతో నాలుగో పవరాస్త్ర సాధించడానికి ముగ్గురు కంటెండర్లు ప్రశాంత్, యావర్,శుభ శ్రీ పోటీ పడనున్నారు.

Also Read:మళ్లీ బీభత్సమే.. ఇక బాలయ్య మారడా?

- Advertisement -