Bigg Boss 7 Telugu:అమర్‌ని దొంగ చేసేశారు

37
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా 102 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఈ సీజన్‌లో ఎక్కువ ఎంటర్‌టైన్ చేసింది ఎవరంటే ఖచ్చితంగా రెండు పేర్లు చెప్పాల్సిందే. అందులో ఒకరు శివాజీ అయితే మరొకరు అమర్‌దీప్. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పెర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్‌లో మీరు ఎంత సేపు కనిపించడానికి అర్హులో చెప్పాలని తెలిపాడు. మెజార్టీ ఇంటి సభ్యుల నిర్ణయం ఆధారంగా వారు ఆ టైమ్ కార్డ్ ధరించాల్సి ఉంటుందని చెప్పాడు.

ముందుగా అర్జున్ తన మెడలో 10 బోర్డ్ వేసుకొని.. ఎంటర్‌టైన్‌మెంట్ కాస్త అటు ఇటు అయినా టాస్కులు ఆడుతున్నాను కాబట్టి 10 నిమిషాలు కనబడాలని కోరుకుంటన్నానని చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకి 7, యావర్‌కి 5, ప్రశాంత్‌కి 3 బోర్డులు ఇచ్చాడు అర్జున్. అమర్‌ తనకి తాను 20 వేసుకొని అందరూ తిడతారేమోనని తీసి 15 నిమిషాల బోర్డు వేసుకున్నాడు. శివాజీ తనకి తాను 5 వేసుకున్నాడు. ఇక అమర్‌ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు.

ప్రశాంత్, యావర్, ప్రియాంకలు కూడా అందరికీ పంచి పెట్టేశారు. అయితే అందరూ నువ్వు దొంగతనాలు చేశావ్ అంటూ అమర్‌కి బోర్డులు ఇవ్వడంతో హార్ట్ అయ్యాడు అమర్.

Also Read:శ్రీ‌వాణి ట్ర‌స్టు… 3,615 ఆల‌యాల నిర్మాణం

- Advertisement -