Bigg Boss 7 Telugu:వైల్డ్ కార్డు ఎంట్రీకి రంగం సిద్ధం

76
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రెండోవారం పూర్తికావడానికి వచ్చింది. ఇక రెండో వారం నామినేషన్ ప్రక్రియ వాడివేడిగా జరిగింది. అంతా పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేయగా ఓటింగ్‌లో మాత్రం టాప్‌లో ఉన్నారు ప్రశాంత్. ఇక ఈ సారి రెండోవారంలోనే వైల్డ్ కార్డు ఎంట్రీకి రంగం సిద్ధమైంది.

బుల్లితెర నటుడు అర్జున్ అంబటిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్‌లోకి పంపబోతున్నారట. ఇప్పటికే హౌస్‌లో సీరియల్ నటులంతా ఓ గ్రూప్‌గా ఉండగా తాజాగా అర్జున్ ఎంట్రీతో ఆయన కూడా సీరియల్ గ్రూపులో చేరుతారా లేదా అన్నది వేచిచూడాలి.

అర్జున్ అంబటి …అగ్ని సాక్షి, దేవత వంటి సీరియల్స్‌తో ప్రేక్షకులను మెప్పించారు. సీరియల్స్‌తో పాటు అనేక సినిమాల్లో నటించాడు. దేశముదురు, సౌథ్యం, అశ్వమేధం లాంటి సినిమాల్లో మెరిశాడు. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు పలు పండగ ఈవెంట్లలో సందడి చేస్తున్నాడు. తాజాగా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు అర్జున్. అన్ని కలిసి వస్తే ఈ వీకెండ్‌లోనే అర్జున్ ఎంట్రీ ఉండనుందని టాక్.

Also Read:‘డెవిల్’ వార్…దర్శక-నిర్మాతల మధ్యలో!

- Advertisement -