బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 70 రోజులు పూర్తి చేసుకుంది. ఇక ఈ వారం రెండు ఎలిమినేషన్స్ తో షాకిచ్చారు నాగార్జున. శనివారం బాలాదిత్యను ఎలిమినేట్ చేసిన నాగ్…ఆదివారం ఎపిసోడ్‌లో భాగంగా వాసంతిని ఎలిమినేట్ చేస్తూ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చారు.
వాస్తవానికి శనివారం బాలాదిత్య ఎలిమినేట్ కావడంతో మరో ఎలిమినేషన్ ఉండదని భావించారు అంతా. అయితే నామినేషన్స్ లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిగా సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున చివరికి వాసంతి, మెరీనా మాత్రమే మిగలగా వీరిద్దరిలో వాసంతిని ఎలిమినేట్ చేశారు. హౌజ్ నుండి బయటకు వచ్చిన వాసంతి.. ఫేక్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ చెప్పమని నాగార్జున అడగగా మెరీనా, ఇనయ, రేవంత్, కీర్తి తన బెస్ట్ ఫ్రెండ్స్ అని, ఫైమా, ఆదిరెడ్డి, రాజ్ ఫేక్ ఫ్రెండ్స్ అని చెప్పింది.
ఇక అంతకముందు సండే ఫన్‌డే ఎపిసోడ్‌లో భాగంగా కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించారు నాగ్. ఇందుకోసం రేవంత్, ఇనయ, మెరీనా, రాజ్, ఫైమాలను A టీమ్‌గా, కీర్తి, శ్రీహాన్, రోహిత్, వాసంతి, శ్రీసత్యలను B టీమ్‌గా విడగొట్టాడు నాగ్. ఒక సినిమా పేరు చూపించి దాన్ని బొమ్మగా గీస్తే అవతలి టీం వాళ్ళు దాన్ని గెస్ చేయాలి. ఈ గేమ్ సరదాగా సాగింది. మధ్య మధ్యలో కంటెస్టెంట్స్ డ్యాన్సులతో రెచ్చిపోయారు.
ఇవి కూడా చదవండి..