బిగ్ బాస్ 6..కెప్టెన్సీ టాస్క్ రచ్చరచ్చ

59
bb6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 18 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. మూడోవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ రచ్చరచ్చగా మారింది. శ్రీహాన్, గీతు, ఆదిరెడ్డి, ఫైమా, శ్రీసత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికకాగా ముందుగానే చేతులెత్తేసింది గీతూ. ఫైమా చేతులు బ్రిగ్స్‌కి తగలడంతో.. ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు సంచాలక్‌గా ఉన్న రేవంత్.

దీంతో కాసేపు హౌస్‌లో గొడవ జరిగింది. ఏ పిట్ట వచ్చి నీ దగ్గర ఏం కూసినా.. సంచాలక్‌గా నీ నిర్ణయం నువ్ తీసుకో అని శ్రీహాన్ అనగా ఇనయ ఆగ్రహంతో మండిపడింది. ఇంతలో గీతు.. మధ్యలో దూరిపోయి పిట్ట అన్నది నిన్ను కాదు నన్ను అంటూ చెప్పగా తర్వాత గొడవ మరింత పెద్దదైంది. ఇనయపై చిప్ దొబ్బిందని ఆదిరెడ్డి, గీతు, నేహా, ఆర్జే సూర్యలు ఆమె గురించి గుసగుసలాడారు.

దొంగల బ్యాచ్ బెడ్ రూమ్‌లో మెరీనా, ఇనయ బందీలుగా చేయడంతో లోపల వాళ్లు మొత్తం వెతుకుతూ కనిపిస్తాడు. దాంతో దొంగ బ్యాచ్‌లో సుదీప, నేహా..వాళ్లు లోపల వెతికితే బయట మనం కూడా వెతుకుదాం.. వెతకండి అంటూ పెద్దపెద్దగా నేహా అరుస్తుంది. ఇక గీతూ బొమ్మకు వంద.. ఎక్కువ బొమ్మలు అమ్మితే వారికి బహుమతి అంటూ బొమ్మలు కొనే పనిలో పడుతుంది.

అడవిలో ఆట టాస్క్ పూర్తి కావడంతో బిగ్ బాస్ అందరినీ హాల్‌లోకి పిలుస్తారు. అడవిలో మొత్తం 141 రెడ్ ట్యాగ్ కలిగిన విలువైన వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాపారస్తుల దగ్గర 51, దొంగ దగ్గర 18, పోలీసులు దగ్గర 17 ఉన్నాయి అని లెక్కలేసి చెప్పాడు కెఫ్టెన్ రాజు. ఈ గేమ్‌లో పోలీసులు విజయం సాధించగా బంగారు కొబ్బరి బొండం శ్రీసత్యా దగ్గర ఉండటంతో నేరుగా కెప్టెన్సీ కంటెండర్‌గా నిలిచింది.

- Advertisement -