మిడ్ వీక్ ఎలిమినేషన్‌..అంతా షాక్!

938
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 ముగింపు దశకు చేరుకుంది. ఇక ఈ వారం ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ జరిగిపోగా బుధవారం మరో ఎలిమినేషన్ ఉంటుందని హోస్ట్ నాగార్జున ప్రకటించడంతో అంతా షాక్‌కు గురయ్యారు. ప్రస్తుతం హౌస్‌లో శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ ఉండగా వీరిలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారు.

అయితే ఇప్పటివరకు బిగ్ బాస్‌లో ఫినాలేకి వెళ్లిన టాప్ 5 కంటెస్టెంట్స్‌కి సంబంధించి.. జర్నీ వీడియోలు వేస్తూ ఉంటారు. అయితే మొదటిగా రేవంత్ వీడియో చూపించారు. బిగ్ బాస్ మీ పర్మిషన్‌తో బేబీ(బొమ్మ)ని తీసుకుంటా.. నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకోవారంలో నేను బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ని గెలిచిన తరువాత నా కూతుర్ని కూడా ఇలాగే ఎత్తుకుంటా బిగ్ బాస్ అని తెలిపారు.

తర్వాత రేవంత్‌తో బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీ కోపమే మీకు బలహీనతగా మారి.. పొరపాట్లకు కారణం అయ్యింది. ఈ విషయాన్ని వెంటనే అర్ధం చేసుకుని అందుకు తగ్గట్లు మారి.. మీ కోపాన్ని పాషన్‌గా మార్చారు. జీవితంలో అన్ని భావాలు కలిగి ఉన్నవాళ్లే నిజమైన విజేతలు అని తెలిపారు. మీ ప్రయాణం అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలి బిగ్ బాస్ ఆశిస్తున్నారు.. ఫినాలేకి ఆల్ ది బెస్ట్ అని చెప్పారు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి..

- Advertisement -