బిగ్ బాస్ 6..పోలీస్ వర్సెస్ దొంగ!

47
police
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా సాగుతోంది. మూడో వారం ఇంటి సభ్యుల మధ్య వివాదంతో హాట్ హాట్‌గా సాగుతోంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా దొంగ – పోలీస్ టాస్క్‌లో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు.

ఎప్పటిలాగే గీతూ, రేవంత్ తమ నోటికి పని చెప్పగా దొరికిన వాళ్ళ వస్తువులన్నిటిని గీతూ దొంగిలించడం మొదలుపెట్టింది. తాను దొంగిలించినవాటిని ఓ సూట్ కేసులో దాచుకుంది. ఇక రేవంత్ వస్తువులు పోవడంతో రేవంత్ అందరిమీద ఫైర్ అయ్యాడు.

తర్వాత పింకీ, రేవంత్ మధ్య కూడా గొడవ జరుగగా నీ బొమ్మలు పోయాయని చెప్పి టీం మొత్తాన్ని రిస్క్ లో పెట్టడం కరెక్ట్ కాదు అని పింకీ రేవంత్ తో గొడవకు దిగింది. రేవంత్ గోడ ఎక్కి పైన ఉన్న వస్తువులని తీసుకునేందుకు ట్రై చేస్తుంటే బిగ్ బాస్ వార్నింగ్ ఇవ్వడంతో దిగిపోతాడు. తర్వాత ఫైమా తనని కొట్టింది అంటూ నేహా కంప్లైంట్ చేయగా ఇక దొంగల టీం లేదా పోలీస్ టీంలలో ఎవరూ గెలుస్తారో ఇవాళ తేలనుంది.

- Advertisement -