ఈసారి విన్నర్‌కి బంపర్ ఆఫర్!

1958
- Advertisement -

బుల్లితెర రియాల్టీషో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 98 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్‌లో భాగంగా ఆదిరెడ్డిని టార్గెట్ చేశారు నాగ్. ఆదిరెడ్డి తప్పును వెతికిమరి తిట్టారు. ఇక విన్నర్ ప్రైజ్ మనీ బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి గేమ్ ఆడించారు నాగ్.

తన ముందు మూడు సూట్‌ కేసులు పెట్టుకున్నారు నాగ్. వాటిలో అమౌంట్ ఎంత ఉందో అది ముందు రివీల్ చేయలేదు.. ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంతో ఒక సూట్ కేసుని సెలెక్ట్ చేసుకుంటే అందులో ఉన్న అమౌంట్ విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ అవుతుందని చెప్పారు. ఈ ప్రాసెస్‌లో హౌస్‌లో ఉన్న వాళ్ల వాళ్ల అంచనాను చెప్పారు.

ఆదిరెడ్డి కూడా లెఫ్ట్ సైడ్ సూట్ కేసులో ఎక్కువ అమౌంట్ ఉండొచ్చని చెప్పాడు. అదే ఎందుకు అని నాగార్జున అడగడంతో.. ఏదోటి చెప్పాలి కాబట్టి.. చెప్తున్నా సార్ అని అన్నాడు. నీ లైఫ్ అంతా ఏదోటి చెప్పాలి కాబట్టి చెప్తావా?? రివ్యూలు కూడా అలాగే చెప్పావా? ఏదోటి చెప్పాలని చెప్పావా? అని అన్నారు. సార్ లోపల ఏముందు ఎలా తెలుస్తుంది సార్.. అందుకే గెస్ చేసి ఏదోటి చెప్పాలి కాబట్టి చెప్పాను అని ఆదిరెడ్డి సమాధానం ఇచ్చాడు. కానీ నాగార్జున మాత్రం.. ఆదిరెడ్డి ఏదో చేయకూడని తప్పు చేసినట్టుగా టార్గెట్ చేశారు.

తర్వాత ఆల్టో కారు టాస్క్‌లో రేవంత్, శ్రీసత్య, కీర్తి టీం.. రేవంత్, ఇనయ, ఆదిరెడ్డిల టీంపై గెలిచింది. ఈ గేమ్‌కి శ్రీహాన్ సంచాలక్‌గా ఉన్నాడు. ఆ తరువాత గత వారం రోజులుగా జరిగిన ఘోస్ట్ టాస్క్‌ని స్క్రీన్‌పై చూపించారు. ఈ సీజన్ విన్నర్‌కి రూ.50 లక్షల ప్రైజ్ మనీతో పాటు.. సువర్ణభూమి వారి రూ.25 లక్షల విలువ చేసే ప్లాట్ ఇవ్వబోతున్నట్టుగా ఇప్పటికే ప్రకటించారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -