మొక్కలు నాటిన బిగ్ బాస్ శ్రీహాన్…

24
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు బిగ్ బాస్ 6 రన్నర్ శ్రీహన్. ఈ సందర్భంగా శ్రీహన్ మాట్లాడుతూ గ్రీన్ఇండియా చాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.వాతావరణ కాలుష్యాన్ని అరికట్టాలంటే మొక్కలు నాటడం తప్పనిసరి అని అన్నారు.

ప్రతి ఒక్కరు తమవంతు బాధ్యత గా మొక్కలు నాటాలని కోరారు. మనుషులు బ్రతకాలంటే మొక్కలను బ్రతకానించాల్సిన అవసరం ఎంతయినా ఉంది అన్నారు. ఈ అవకాశం కల్పించిన జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆదిరెడ్డి, గీతూ,రేవంత్ ఈ ముగ్గురు కూడా మొక్కలు నాటాలని కోరారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -