బిగ్‌బాస్‌ 6..ఫస్ట్ వీక్‌ నామినేషన్స్‌లో ఉంది వీరే!

154
bb6
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు 6 విజయవంతంగా కొనసాగుతోంది. నామినేషన్స్ ప్రక్రియ వచ్చిందంటేనే ఇంటి సభ్యలు మధ్య గొడవతో హౌస్ మొత్తం దద్దరిల్లిపోతుంది. తాజాగా అలాంటిదే జరిగింది. కంటెస్టెంట్స్ కి ఇచ్చిన క్లాస్‌, మాస్‌, ట్రాష్‌ టాస్క్ ముగియగానే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు.

ముందుగా ట్రాష్‌లో ఉన్న ఆదిత్య, ఇనయ, అభినయ శ్రీ నేరుగా ఈ వారం నామినేట్‌ అయ్యారు. చివర్లో బిగ్‌బాస్‌ ఓ ట్విస్ట్‌ ఇచ్చి ట్రాష్‌లోని సభ్యులొకరు మాస్‌ టీమ్‌ మెంబర్‌తో స్వాప్‌ అవ్వొచ్చని చెప్పడంతో దీంతో బాలాదిత్యను సేఫ్‌ చేసి ఆ స్థానంలోకి ఆరోహిని పంపించారు. క్లాస్‌ టీమ్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి, నేహా ఈవారం నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు.

మొదట సింగర్ రేవంత్‌ వచ్చి.. హౌస్ లో ఫైమా పని చేయట్లేదంటూ ఫైమాని, నేను నిద్రపోయినప్పుడు సూర్యతో ముచ్చట్లు పెడుతూ నిద్ర డిస్టర్బ్‌ చేసిందని ఆరోహిని నామినేట్ చేశాడు. వీటికి ఫైమా స్పందిస్తూ నేను పనిచేస్తున్నప్పుడు నువ్వు చూడకపోతే అది నా తప్పు కాదు అని సీరియస్ అయింది. ఆ తర్వాత కీర్తి భట్‌ వచ్చి.. నాకు, శ్రీహాన్‌కు మధ్య ఉన్న బంధంపై రేవంత్‌ జోక్‌ చేశాడు. సరే అని నేను శ్రీహాన్‌ను చోటు భయ్యా అని పిలుస్తుంటే శ్రీహాన్‌ సరిగా మాట్లాడట్లేదు. అందుకే వీరిద్దర్నీ నామినేట్ చేస్తున్నా అని చెప్పింది.

తర్వాత ఆరోహి.. శ్రీసత్య,. రాజశేఖర్ ని కూడా నామినేట్ చేసింది. శ్రీసత్య.. ఆరోహి, వాసంతి, రాజశేఖర్‌ లను నామినేట్‌ చేసింది.సుదీప.. సరిగ్గా మాట్లాడటంరాదు అని రేవంత్‌ ని నామినేట్ చేసింది, పనులు చెయ్యట్లేదు అంటూ చంటిని నామినేట్ చేసింది.ఫైమా.. రేవంత్‌ తానే కరెక్ట్ అంటూ మాట్లాడుతాడు అని రేవంత్ ని, నా గురించి తప్పుగా మాట్లాడడేమో అని అర్జున్‌ ని నామినేట్ చేసింది.

దీంతో ఇంటి సభ్యుల మధ్య గొడవలు మొదలయ్యాయి. మొత్తంగా మొదటి వారం నామినేషన్స్ లో అత్యధికంగా ఓట్లు ఉన్న రేవంత్‌, చంటి, శ్రీసత్య, ఫైమాలు, ట్రాష్ ద్వారా వచ్చిన ఇనయా, ఆరోహి, అభినయశ్రీ నామినేషన్స్ లో ఉన్నారు.

- Advertisement -