బిగ్‌బాస్ 5కి ముహూర్తం ఖరారు..

88
Bigg Boss 5

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 5 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌నే వార్త‌లు కొన్నిరోజులు వినిపిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజా సమాచారం మేరకు బిగ్‌బాస్ 5 సెప్టెంబ‌ర్ నుంచి ప్ర‌సారం అవుతుందని తెలుస్తోంది. కాగా.. బిగ్‌బాస్ 5 తెలుగు ప్రోమోను స్టార్ మా ఈరోజు రిలీజ్ చేసింది. ఈ సీజ‌న్ 5ను నాగార్జున హోస్ట్ చేయ‌డ‌ని, రానా హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా రీసెంట్‌గా వార్త‌లు వినిపించాయి. కానీ నాగార్జునే హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తాయి.

తెలుగు బిగ్ బాస్‌కి ఇత‌ర భాష‌ల క‌న్నా మంచి ఆద‌ర‌ణ ద‌క్కుతుంది. నాలుగు సీజన్స్ మంచి హిట్ కావ‌డంతో ఐదో సీజ‌న్‌ని గ్రాండ్‌గా లాంచ్ చేయ‌నున్నార‌ట‌. ఇక ఎప్ప‌టి మాదిరిగానే ఈ సారి కూడా బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెంస్టెంట్స్ అంటూ కొంద‌రి పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి.