బిగ్ బాస్ 5 తెలుగు..సండే ఫన్‌డే(సెకండ్ వీక్)

194
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా రెండువారాలు పూర్తిచేసుకుంది. రెండోవారం ఎలిమినేషన్‌లో భాగంగా ఉమాదేవి ఇంటి నుండి బయటకురాగా ఆదివారం సండే ఫన్‌డేగా సాగింది. ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్ థ్రిల్ ఇచ్చారు నాగ్. మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌ ఇంటిసభ్యులతో ప్రత్యేకంగా ముచ్చట్లు సాగించారు. మొత్తంగా సండే ఫన్‌డేగా మారిపోయింది.

తొలుత గార్డెన్ ఏరియాలో డెస్టినీ గేమ్‌ని ఏర్పాటుచేశారు నాగ్. కప్పులో బాల్ వేయాలి.. ఆ కప్పు కింద ఓ పేరు కనిపిస్తుంది.. వారే మీకు జోడి.. అదే మీ డెస్టినీ.. ఆ జోడి డ్యాన్స్ వేయాలి. వారికి నేను మార్కులు వేస్తాను అని నాగార్జున అన్నాడు. మొదటగా ఉమాదేవీ వేసిన బాల్ కప్పులో పడగా షన్నుతో కలిసి డ్యాన్స్‌ చేసింది. అలా ఒక్కొక్కరుగా వచ్చి డ్యాన్స్‌ చేసి సందడి చేశారు.

ఆ తర్వాత టాస్కు పూర్తి అవ్వడంతో మరో ఇంటిసభ్యులను నాగ్ సేఫ్ చేశాడు. ప్రియ సేఫ్ అయినట్టు చెప్పేశాడు. ఇక మిగిలిన ఇద్దరు నటరాజ్ మాస్టర్, ఉమా దేవీలను గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగ్. ఆ ఇద్దరికి గన్ను ఇచ్చారు. ఏదైతే పేలుతుందో ఆ గన్ను పట్టుకున్న వారు సేఫ్ అయినట్టు తెలిపాడు.

ఎలిమినేషన్‌ నుండి నటరాజ్ మాస్టర్ సేఫ్‌ కావడంతో కాస్త ఎమోషన్ అయ్యారు. ర్యను ఇలాంటి సమయంలో వదిలేసి వచ్చాను.. ఏదో ఒకటి సాధించి వెళ్లాలని అనుకున్నాను అంటూ నటరాజ్ మాస్టర్ భోరున ఏడ్చేశాడు. ఉమా దేవీకి కంటెస్టెంట్లు అందరూ కన్నీటి వీడ్కోలు ఇచ్చేశారు.

ఇక ఎలిమినేషన్ అయిన ఉమాదేవి బయటకు నవ్వుతూ వచ్చింది. ఈ సందర్భంగా ఆమె బిగ్ బాస్ జర్నీని చూపించిన నాగ్…ఆమెను థ్రిల్ చేశారు. తర్వాత ఇంట్లో ఉన్న 17 మంది సభ్యుల్లో 8 మంది గురించి చెప్పమని అడగ్గా ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసింది. ఎదుటి వారి రియాక్షన్లను కూడా పట్టించుకోవాలి అంటూ సిరికి సలహా ఇచ్చిన ఉమా…. ఎవరి ఆట వాళ్లు వారే ఆడుకోవాలి అని తెలిపింద. ఇక లహరి ఇంట్లో చాలా వీక్ అని.. ఎవరి సాయం తీసుకోకుండా ఆడు అంటూ లహరికి సూచించింది.

ప్రియ సేఫ్‌గా ఆడుతోందని …షన్ను బేటా అంటూ నీ గేమ్ నువ్ ఆడుకో అంటూ సలహా ఇచ్చింది. సిరి నీకు కేవలం ఫ్రెండ్ మాత్రమే.. అది నీకు ప్లస్ అవుతుంది.. మైనస్ అవుతుంది అని తెలిపింది. ఇక రవికి చురకలు అంటించింది. అందరినీ దగ్గర తీసుకునే క్రమంలో మిగతా వారికి దూరం అవుతున్నావేమో అని తెలపగా ఐ మిస్ యూ భంగు.. మన గురించి ఎంతో మంది ఎన్నో అనుకుంటారు.. కానీ మనం ఏంటో మనకు తెలుసు అంటూ లోబో గురించి చెప్పింది. ఇక అనీ మాస్టర్ …ఏదైనా గొడవ జరిగితే తొందరగా రియాక్ట్ అవుతున్నారు.. ఎక్కడ పాయింట్ అనిపిస్తే అక్కడే రైజ్ అవ్వండని సలహా ఇచ్చిన ఉమా…నటరాజ్ మాస్టర్ గురించి ఆటని ఆటలా ఆడాలని .. అలానే ఆడండి.. అప్పుడు మీరు వేరే లెవెల్‌లో ఉంటారు అని తెలిపింది.

- Advertisement -