సన్నీకి బంపర్ ఆఫర్ ఇచ్చిన ప్రియా..

115
bb5
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఇక 7వ వారంలో అందరూ ఊహించినట్లుగానే ఇంటి నుండి ప్రియా ఎలిమినేట్ అయింది. ఇంటి నుండి బయటకు వచ్చిన ప్రియ తన బిగ్ బాస్ జర్నీ చూసి ఎమోషనల్ అయింది. ఒక్కొక్కరికి ఎన్ని మార్కులు ఇస్తావో.. ఎందుకు ఇచ్చావో కూడా చెప్పమని ప్రియకు టాస్క్ ఇచ్చాడు నాగ్.

సన్నీకి 9 మార్కులు ప్రియ ఇచ్చింది. ఆటలో ఎన్నో అనుకున్నాం అవన్నీ అక్కడికే వదిలేయాలి. నా ప్లేట్లో తినే హక్కు, నా కాఫీ కప్పులో కాఫీ తాగే హక్కు ఒక్క సన్నీకి మాత్రమే ఉంటుందని ప్రియ చెప్పుకొచ్చింది.లోబోకు ఐదు మార్కులు ఇచ్చిన ప్రియా…ఏదో ఒక సైడ్ వంద శాతం ఉండు అని సలహా ఇచ్చింది. టాస్కుల్లో అందరికీ అవకాశం ఇవ్వు. కొంచెం జాగ్రత్తగా ఆడు అని విశ్వకు సలహా ఇచ్చింది. సిరి, షన్నులకు ఎనిమిదన్నర ఇచ్చింది. మీ ముగ్గురు ఎప్పటికీ ఇలానే కలిసి ఉండండి. షన్ను చాలా మంచి వాడని తెలిపింది.శ్రీరామచంద్రకు ఎనిమిది మార్కులు ఇచ్చిన ప్రియా….అతడి మూడ్ బాగుంటే అందరినీ నవ్విస్తాడని చెప్పుకొచ్చింది.

ప్రియాంకకు పది మార్కులకు వంద మార్కులు ఇచ్చింది ప్రియా. చాలా మంచిది. పొద్దున లేవగానే ఆమె మొహమే చూస్తాను అని చెప్పుకొచ్చింది. ఆనీ మాస్టర్‌కు కూడా పది మార్కులు ఇచ్చింది. చాలా చూసి వచ్చింది. కానీ అందరినీ గుడ్డిగా నమ్మేస్తుందని తెలిపింది. జెస్సీకి ఎనిమిది మార్కులు ఇచ్చి.. ఆట విషయానికి వచ్చే సరికి బాగా ఆడుతుంటాడు అని చెప్పింది.

కాజల్‌కు ఏడు మార్కులు ఇచ్చింది. మొదట్లో బాగానే ఆట ఆడింది. కానీ ఇప్పుడు ఆమె వేసే ప్రతీ అడుగు మాకు తెలిసిపోతోందని తెలిపింది. మానస్‌కు పది మార్కులు ఇచ్చింది. మానస్ బంగారు కొండ. చిన్న వయసులోనే ఎంతో మెచ్యూరిటీ వచ్చిందని తెలిపింది.

- Advertisement -