బిగ్ బాస్ 5..వైల్డ్ కార్డుకు శుభం పడ్డట్లేనా..?

166
nag
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్. తెలుగులో 5వ సీజన్ ప్రారంభమై మూడు ఎపిసోడ్స్ కూడా పూర్తి చేసుకుంది. 3 రోజులకే బిగ్ బాస్ చేపల మార్కెట్‌ను తలపించగా 19 మంది ఇంటిసభ్యుల మధ్య గొడవలతో రచ్చరచ్చగా సాగుతోంది.

అయితే ఇప్పటివరకు బానే ఉన్నా…బిగ్ అనగానే గుర్తుకొచ్చేది వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఈ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చే కంటెస్టెంట్‌ హౌస్‌ను నెక్ట్స్ లెవల్‌ను తీసుకెళ్తారు. అయితే ఇదంతా గతం. కానీ లెటేస్ట్‌గా అందుతున్న బుజ్‌ ప్రకారం ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ వచ్చే అవకాశం లేదట. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

అయితే మరికొందరు మాత్రం ఇప్పుడున్న కంటెస్టెంట్స్‌లో పాపులర్ ముఖాలు ఎవరూ లేకపోవడంతో అందరికి తెలిసిన కంటెస్టెంట్‌ను రంగంలోకి దించడం ద్వారా మరింత రేటింగ్ తీసుకురావాలని నిర్వాహకులు భావిస్తున్నారట. ఏది ఏమైనా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఉంటుందా లేదా అన్న సస్పెన్స్‌కు బిగ్ బాస్ తెరదింపుతాడో లేదో వేచిచూడాలి.

- Advertisement -