బిగ్ బాస్ 5…బిగ్ ట్విస్ట్

147
siri
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు సీజన్‌ 10వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ హాట్ హాట్‌గా సాగిన సంగతి తెలిసిందే. దానికి కంటిన్యూగా జెస్సీని బయటకు తీసుకొస్తూ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు బిగ్ బాస్. నామినేషన్స్‌లో కాజల్‌ని టార్గెట్ చేస్తూ నామినేట్ చేసిన అనీ మాస్టర్ తర్వాత గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకోవడం మొదలుపెట్టింది.

అయితే సన్నీ, మానస్‌లను సేవ్ చేయకుండా కాజల్.. షణ్ముఖ్‌ని సేవ్ చేయడం పట్ల సన్నీ అలిగాడు. ఇక ప్రియాంక… షణ్ముఖ్ విషయంలో జరిగిన గొడవపై మాట్లాడుతూ.. అతని దగ్గర కూర్చుని బోరున ఏడ్వడం మొదలుపెట్టింది. నామినేషన్స్ విషయంలో కాజల్ తీసుకున్న నిర్ణయంపై సన్నీ రగిలిపోయాడు. ఉంటే కలిసి ఉందాం.. పీకితే కలిసే పీకుదాం.. ఫైట్ చేద్దాం.. మనల్ని సేవ్ చేయకూడదని కాజల్ అనుకుంది.. చివరికి దేవుడు ఏం చేశాడో చూశాం కదా.. నామినేషన్స్ అనేది గేమ్ కాదు.. బయటకు పంపే ప్రక్రియ దాన్ని సిల్లీగా తీసుకోకూడదు అని మానస్‌తో చెప్పాడు సన్నీ.

ఆ తర్వాత జస్వంత్‌ని కన్ఫెషన్ రూంకి పిలిచిన బిగ్ బాస్.. ఆరోగ్య పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. మీకు మెడికల్ ఇన్వెస్టిగేషన్ చాలా అవసరం.. అందుకోసం మీరు ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది.. బయటకు వెళ్లి ఇంటి సభ్యులందరికీ చెప్పి.. మెయిన్ గేట్ నుంచి బయటకు రావాల్సిందిగా జెస్సీకి చెప్పారు బిగ్ బాస్.

దీంతో జెస్సీ ఎమోషనల్ అవుతూ….థాంక్స్ బిగ్ బాస్.. నాకు మంచి అవకాశం ఇచ్చారు.. నేను ఇంత వరకూ రావడానికి హెల్ప్ చేశారు. నాకు గ్రేట్ లైఫ్ ఇచ్చారు.. నాగ్ సార్ ఐ మిస్ యూ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. షణ్ముఖ్, సిరిలు తీవ్ర భావోద్వేగానికి గురౌతూ ఏడుస్తూనే సాగనంపారు. ఇక నిన్నటి వరకూ బద్దశత్రువుల్లా కనిపించిన కాజల్, శ్రీరామ్‌లో నేటి ఎపిసోడ్‌లో క్లోజ్‌గా మూవ్ అయ్యారు.

ఆ తరువాత ప్రియాంక.. మానస్ తనతో మాట్లాడటం లేదని కాజల్ దగ్గర తెగ ఫీల్ అయిపోవడంతో.. అసలు నువ్ మానస్ కోసమే వచ్చావా? బిగ్ బాస్‌కి .. వెయిట్ చేయి మాట్లాడతాడులే.. ఎవరూ ఎవరికోసం రాలేదు.. ఇదే గేమ్.. గేమ్‌లాగే ఆడు’ అని చురకలేసింది కాజల్. జెస్సీ, మానస్‌లను సేవ్ చేయకుండా షణ్ముఖ్‌ని కాజల్ సేవ్ చేయడంతో.. ఈ ఇద్దరూ కాజల్‌తో మాట్లాడటం మానేశారు. దీంతో కాజల్.. మానస్, జెస్సీల దగ్గరకు వచ్చి.. నేను ఈవారం ఎలాగూ ఎలిమినేట్ అయిపోతా.. ఈ ఒక్కవారం అయినా మాట్లాడండిరా అని ప్రాధేయపడింది.

- Advertisement -