బిగ్ బాస్ 5…ఎపిసోడ్ 61 హైలైట్స్

110
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 61 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. గురువారం నాటి ఎపిసోడ్‌లో భాగంగా స్నేహితుల పేరుతో రొమాన్స్ చేస్తున్న సిరి – షన్ను మధ్య గ్యాప్ పెరిగింది. ఇక తొలుత సూపర్ హీరోస్ టీం నుంచి ప్రియాంక వచ్చింది. విలన్ టీం ఏ టాస్క్ ఇచ్చినా దానిని చేసింది. రవి రకరకాల ఫిజికల్ టాస్కులు ఇచ్చాడు. సిట్ అప్స్ చేయించాడు. బకెట్ చేత్తో నిటారుగా పట్టుకోవాలని అన్నాడు. చివరగా ప్రియాంక గెలిచి ఒక పాయింట్ సంపాదించి పెట్టింది.

తర్వాత విలన్ టీం నుంచి ఆనీ మాస్టర్‌ ముందుకొచ్చింది. రకరకాల డ్రింకులు ఇచ్చారు..చివరకు అనీ మాస్టర్ అన్ని తట్టుకుని నిలబడి గెలిచింది. సిరి మధ్యలో బెడ్రూంకి వెళ్లి అందరి బట్టలు చిందరవందరగా పడేస్తుంది. ఇక శ్రీరాం కూడా అలానే చేస్తాడు. ఈ క్రమంలో సిరి, షన్ను మధ్య మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఎందుకు అలా అరుస్తున్నావ్ అంటూ సిరి తరుపున జెస్సీ అడుగుతాడు.అప్పుడు సంచాలక్ కాబట్టి అలా అరిచాను అంటాడు అది తప్పు అయితే నామినేట్ చేయండని అంటాడు.

అందరి బట్టలను అలా పడేయడం, లో దుస్తులనుకూడా అలా విసిరేయడంతో షన్ను సీరియస్ అయ్యాడు. ఇన్నర్స్ ఎందుకు అలా పడేశావ్.. అవి సర్దు అంటూ సిరికి ఆర్డర్ వేశాడు షన్ను. నేను చేయను అంటూ సిరి మొండికేయగా ఇదే నీ కారెక్టర్ అంటూ సిరిపై మండిపడ్డారు షణ్ను.

ఇక సిరి గురించి కాజల్, షన్నులు మాట్లాడుకున్నారు. సిరి చాలా స్ట్రాంగ్.. టాస్కుల్లో బాగా ఆడుతుంది అని షన్ను అంటే.. సిరి రాడ్.. అని కాజల్ అంటుంది. తర్వాత వంటగదిలో మళ్లీ గొడవ మొదలైంది. ప్రియాంక ఒకటి అంటే.. సిరి ఇంకొకటి అంది. మొత్తానికి వంట కాస్త పెంటలా మారిపోయింది.

- Advertisement -