బిగ్ బాస్ 5..ఎపిసోడ్ 103 హైలైట్స్

52
siri

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ 103 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. గాజువాక పిల్లా.. మేం గాజులోళ్లం కాదా? అనే పాటతో ఎపిసోడ్ ప్రారంభంకాగా ఆ వెంటనే సిరి-షణ్ముఖ్‌ల గబ్బు ఆట మొదలుపెట్టేశారు. సోఫాలో సిరి-షణ్ముఖ్‌లు కూర్చుని ఉండగా.. బిగ్ బాస్ కోరికమేరకు సిరి.. పెళ్లం ఇచ్చినట్టు అడక్కుండానే కాఫీ ఇవ్వకండి అని అన్నాడు. పెళ్లం అని అనగానే సిరి ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ.. ఏంటి సార్ మీకు అలా అనిపిస్తుందా?? పొద్దు పొద్దున్నే ఏమైంది మీకు అని అడిగింది.

దీంతో షణ్ముఖ్.. ఏంటి సిరీ.. నా ఫొటోలు పెట్టావ్.. ఊ ఊ పడిపోయావ్ అని అన్నాడు. ఏంటి నీకు పడిపోయానా? అని సిరి అడిగితే…మరి ఫొటోలు ఎందుకు పెట్టావ్ అని షణ్ముఖ్ అడిగాడు. తర్వాత సిరికి టైటిల్ వస్తే తాను సహించలేనని షణ్ముఖ్‌ అనగా సిరి.. నాకు టైటిల్ వస్తే నువ్ సహించలేవేమో.. నీను నీకు వస్తే సహిస్తా.. అని తెలిపింది సిరి. నేను యాక్టర్‌ని ఎవరు యాక్ట్ చేస్తున్నారో నాకు తెలిసిపోద్దని షణ్ముఖ్‌ చెప్పగా సిరి మురిసిపోయింది.

ఇక గురువారం ప‌లు టాస్క్ లు ఇచ్చి ఇంటి స‌భ్యుల‌ని ఎంట‌ర్‌టైన్ చేశారు. కొన్ని శ‌బ్ధాలు ప్లే చేసి, వాటి గురించి రాయాల‌ని చెప్పాడు. బెకబెకల శబ్ధాన్ని సిరి ఎలుకగా గుర్తించి తప్పులో కాలేయడంతో అందరూ పగలబడి నవ్వారు. ఈ ఛాలెంజ్‌లో శ్రీరామ్‌ గెలుపొందాడు.ఐదో టాస్క్‌లో సిరి, సన్నీ, షణ్ను ఆడగా సన్నీ గెలిచాడు. ఓడిపోయావ్‌ కదా, మళ్లీ ఆడదామా అంటూ సన్నీ సిరిని సరదాగా ఆటపట్టించాడు. అయితే ఓట‌మి అనే మాట సిరికి న‌చ్చ‌క‌పోవ‌డంతో స‌న్నీపై ఫైర్ అయింది. సన్నీ ఎంత సర్ధిచెప్పినా పిచ్చిపట్టినట్టు చేసింది.