బిగ్‌బాస్ -5 కంటెస్టెంట్లు వీరే..!

254
bigg boss
- Advertisement -

తెలుగు బుల్లితెరపై సూపర్‌డూపర్ హిట్ అయిన మోస్ట్ అవేటైడ్ గ్రాండ్ రియాలిటీ షో బిగ్‌బాస్‌ సీజన్ – 5 త్వరలోనే రాబోతుంది. ఇప్పటికే నాలుగు సీజన్లు పోటీ చేసుకున్న తెలుగు బిగ్‌బాస్‌ -5 సీజన్‌ 5 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని కోట్లాదిమంది అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. నాగార్జున హోస్ట్ చేసిన గత సీజ్ – 4 ఉర్రూతలూగించడంతో సీజన్ – 5 పై కూడా నిర్వాహకులు భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు.

కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే వార్తల నేపథ్యంలో బిగ్‌బాస్ సీజన్ 5 ఇప్పట్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న డౌట్లు వచ్చాయి. కాని తాజాగా బిగ్‌బాస్ – సీజన్ 5 సెప్టెంబర్ 5 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుందని తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ సీజన్‌కు సంబంధించిన లోగో ప్రోమో కూడా విడుదలైంది. ఇక వరుసగా షోను ప్రమోట్ చేస్తూ పలు ప్రోమోలు వస్తాయని టాక్. ఇప్పటికే బిగ్‌బాస్ సెట్‌కు సంబంధించిన ఫినిషింగ్ వర్క్ జరుగుతుందని టాక్. దీంతో బిగ్ బాస్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బిగ్‌బాస్ – 5 లో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విషయమై ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెరిగింది. గత సీజన్ – 4 లో కంటెస్టెంట్ల విషయంలో తొలుత మిక్స్‌డ్ ఒపీనియన్స్ వచ్చినా..షో సాగుతున్న కొద్ది కంటెస్టెంట్లంతా ఫుల్ క్రేజ్ సంపాదించారు. ఇప్పుడు బిగ్‌బాస్ – 5 సీజన్‌ కంటెస్టెంట్ల ఎంపికపై దృష్టి సారించిన బిగ్ బాస్ టీమ్.. 50 మందితో ఆన్‌లైన్ ద్వారానే సంప్రదింపులు జరిపారట. ఈ జాబితాలోని సభ్యులతో జూమ్ కాల్ ద్వారా ఇంటర్వ్యూలు జరిపారు. అయితే ఇప్పటికే బిగ్‌ బాస్ – 5 లో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ మీడియాలో పలువురి సెలబ్రిటీల పేర్లు లీక్ అయ్యాయి.

రీసెంట్‌గా అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫేమస్ యాంకర్ రవి, రఘు మాస్టర్, యాంకర్ వర్షిణి సౌందరాజన్, యూట్యూబ్ స్టార్స్ సిరి హన్మంత్, షణ్ముక్‌చంద్, పాపులర్ సీరియల్ హీరోయిన్ నవ్య స్వామి, శ్రీహాన్, నటి గీతా సింగ్, క్యారెక్టర్ ఆర్టిస్టు సురేఖ వాణి, ప్రియ, టిక్ టాక్ దుర్గారావులు పాల్గొనబోతున్నట్లు ఓ జాబితా బయటకు వచ్చేసింది. అలాగే బిగ్‌బాస్ – 5 లో సుడిగాలి సుధీర్ కూడా కంటెస్టెంట్‌గా రాబోతున్నట్లు టాక్‌ నడుస్తోంది. మొత్తంగా యాంకర్స్, సిసినిమా తారలు, యూట్యూబ్ స్టార్స్‌తో బిగ్‌బాస్ – సీజన్ 5 వచ్చే నెల గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుందని సమాచారం. మరి బిగ్‌బాస్ – 5 లో పాల్గోనే కంటెస్టెంట్లు ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.

- Advertisement -