బిగ్ బాస్ 5..ఈవారం నామినేషన్స్‌లో ఆరుగురు

94
bb5
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా 51 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 8వ వారం కీలకమైన నామినేషన్ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ వారం నామినేషన్‌లో ఆరుగురు నిలవగా సిరి తన ఫ్యామిలీని తలుచుకుని ఎమోషన్ అయింది.

లోబో కన్నీళ్లు పెట్టుకుని రవి ముందు ఎమోషనల్ అయ్యాడు. పక్కకి వెళ్లి మాట్లాడటం వెనక్కి వెళ్లి మాట్లాడటం కరెక్ట్ కాదు.. నాకు తెలిసిన లోబో అలాంటి వాడు కాదు. లోబో అంటే ముఖంపైనే మాట్లాడతాడు. ఫ్రెండ్ తప్పు చేసినప్పుడు ఫ్రెండ్ క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు అంటూ లోబోని క్షమించేశాడు రవి.

ఇక ఈవారం నామినేషన్స్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సరికొత్త టాస్క్ ఇచ్చారు. ఫ్యామిలీలకు దూరమై 50 రోజులు పూర్తింది.. మీ ఫ్యామిలీ సభ్యుల పిలుపు వినాలని అందరూ ఎదురు చూస్తుంటారు.. అందుకోసం మీ అందరికీ మీ ప్రియమైన వారి నుంచి లేఖను పొందుకునే అవకాశం కల్పిస్తున్నాం.. అయితే ఆ లేఖ పొందుకోవాలంటే మరొకటి వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు.

ఎవరైతే లేఖను అందుకుంటారో వాళ్లు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు.. లేఖను అందుకోలేని సభ్యుడు నామినేట్ అవుతారని చెప్పారు బిగ్ బాస్. అంటే సీక్రెట్ రూంకి వెళ్లిన ఇద్దరు.. హౌస్‌లో ఉన్న ఇద్దరి నామినేషన్స్ భవిష్యత్‌ని తేలుస్తారన్నమాట. మొదటగా శ్రీరామ్-మానస్‌లు ఇద్దరికీ పోస్ట్ వచ్చింది. ఇద్దరూ సీక్రెట్ రూంకి వెళ్లి పోస్ట్ కార్డ్‌లు ఓపెన్ చేయగా అందులో ప్రియాంక, లోబోలకు వచ్చిన పోస్ట్ కార్డ్‌లు ఉన్నాయి. దీంతో ప్రియాంక, లోబో ఇద్దరూ చర్చించుకున్నారు. ఫస్ట్ టైం మా నాన్న నాకు ఒక లేఖ రాశారు.. అది నాకు చాలా ఇంపార్టెంట్ అని ప్రియాంక చెప్పడంతో లోబో కన్వెన్స్ అయ్యాడు. దీంతో శ్రీరామ్-మానస్‌లు ఇద్దరూ చర్చించి ప్రియాంకకి లెటర్ ఇచ్చి.. లోబో లెటర్‌ని మిషన్‌లో వేసి ముక్కలు చేశారు. ప్రెగ్నెంట్‌తో ఉన్న తన భార్య.. తన పిల్లలు రాసిన లెటర్‌ని ముక్కలు చేస్తుంటే అది చూసి లోబో ఎమోషనల్ అయ్యాడు.

ఇక రెండో నామినేషన్స్‌లో భాగంగా షణ్ముఖ్-రవిలు ఇద్దరూ సీక్రెట్ రూంకి వెళ్లారు. వీళ్లకి సిరి, విశ్వల ఇంటి వద్ద నుంచి వచ్చిన పోస్ట్ కార్డ్‌లు లభించాయి. అయితే తన కొడుకు భార్యని మిస్ అవుతున్నా.. చిన్న పిల్లోడికి దూరంగా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకో.. కనీసం వాడి ఫొటో కూడా నేను చూడలేదు నాకు ఆ లెటర్ చదివే అవకాశం ఇవ్వమని విశ్వ కన్నీళ్లు పెట్టుకోవడంతో సిరి అతని కోసం త్యాగం చేసింది.

ఇక మూడో నామినేషన్స్‌లో భాగంగా.. ప్రియాంక, కాజల్‌లు సీక్రెట్ రూంకి వెళ్లి లెటర్స్ బ్యాగ్ తీసుకుని రాగా.. అందులో ఆనీ మాస్టర్, మానస్‌ల ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ ఉన్నాయి. అయితే మానస్ ఆనీ మాస్టర్ కోసం త్యాగం చేసి.. ఆమెకు లెటర్‌ను చదువుకునే అవకాశం ఇచ్చాడు. నాలుగో నామినేషన్స్‌లో భాగంగా.. లోబో, విశ్వలు సీక్రెట్ రూంకి వెళ్లగా.. రవి, శ్రీరామ్‌ల ఇంటి దగ్గర నుంచి వచ్చిన లెటర్స్ వచ్చాయి. అయితే రవి కోసం త్యాగం చేయడానికి శ్రీరామ్ ముందుకొచ్చాడు. అయితే శ్రీరామ్ కూడా తాను రవికోసం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నానని కొద్దిసేపు వాదించుకున్నారు. చివరకు లెటర్ శ్రీరామ్‌కి ఇవ్వగా చెల్లి, పేరెంట్స్ ప్రేమగా లెటర్ రాశారు.

ఐదో నామినేషన్స్‌లో భాగంగా సిరి, ఆనీ మాస్టర్‌లు పోస్ట్ బ్యాగ్‌లను తీసుకుని రాగా.. అందులో కాజల్, షణ్ముఖ్ లెటర్స్ ఉన్నాయి. కాజల్ కోసం ఆమె భర్త విజయ్ లెటర్‌ను పంపించగా.. షణ్ముఖ్ కోసం అతని తల్లి లెటర్ పంపించింది. అయితే ఆ లెటర్‌ని చూడగానే కాజల్ ఎమోషనల్ అయ్యింది. షణ్ముఖ్ కాజల్‌కి లెటర్ ఇవ్వడానికి ఒప్పుకోగా సిరి పుల్ల పెట్టింది. కాసేపు వాదనలు అనంతరం షణ్ముఖ్ లెటర్‌ని సిరి ముక్కలు చేసింది.

ఫైనల్‌గా సన్నీ ఒక్కటే మిగలడంతో పాటు.. హౌస్ కెప్టెన్‌గా ఉండటంతో అతనికి స్పెషల్ పవర్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా.. జెస్సీకి లేఖ లభించలేదని.. అతన్ని నామినేట్ చేయాలనుకుంటే ఆ లేఖను అతనికి ఇవ్వకుండా ముక్కలు చేసి నామినేట్ చేయొచ్చని సేవ్ చేయాలనుకుంటే అతని లేఖను అందించవచ్చని చెప్పారు. చివరికి శ్రీరామ్ జెస్సీని కన్వెన్స్ చేసి ఒప్పించి మరీ నామినేషన్స్‌లోకి వెళ్లాడు. మొత్తంగా 8 వ వారం నామినేషన్స్‌లో లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ ఈ ఆరుగురు ఉన్నారు.

- Advertisement -