బిగ్ బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతోంది. శనివారం జరిగిన ఎపిసోడ్లో నాగార్జున హౌజ్‌మేట్స్‌తో ఆట ఆడుకున్నారు. ఇంటి సభ్యులకు ఆసక్తికరమైన టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌తో బిగ్ బాస్ హౌస్‌ని కోర్టులా మార్చేశారు నాగార్జున. మొదటిగా ఆనీ మాస్టర్‌కి ఛాన్స్ ఇవ్వగా.. కాజల్‌ని జైలులో వేసింది ఆనీ మాస్టర్. అయితే జరిగిన ఇష్యూ మొత్తాన్ని తనవైపు తిప్పుకుని తప్పు అంతా కాజల్‌దే అన్నట్టుగా చెప్పింది. అయితే కాజల్ డిఫెండ్ చేయబోగా.. నాగార్జున ముందే మళ్లీ నాగినిలా డాన్స్ చేసి హేళన చేసింది ఆనీ మాస్టర్.
ఆ తరువాత రవి.. సన్నీపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సన్నీ మాట జారుతున్నాడు. కోపంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. యాక్షన్‌కి కంట్రోల్ లేకుండా పోయింది. అప్పడం అయిపోతుంది.. తన్నుతా.. యూట్యూబ్ వరకే అని అన్నాడు. ఇవన్నీ నాకు నచ్చలేదు అని అన్నాడు రవి. ఈ క్రమంలో సన్నీ తాను కొన్ని మాటలు అనలేదని చెప్పగా వీడియో చూపించి క్లారిటీ ఇచ్చాడు. ఇక తర్వాత సన్నీ.. సిరిని బోనులో నిలబెట్టి ఎఫైఆర్ ఫైల్ చేశాడు. కానీ మానస్, కాజల్ తప్ప అందరూ సిరిని నిర్దోషి అని పేర్కొన్నారు. మానస్.. యానీ మాస్టర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ అది అక్కడితో ఆగిపోయింది. శ్రీరామచంద్ర.. ప్రియాంకను బోనులో పెట్టాడు. మానస్ గట్టిగా అరవడం నచ్చలేదని అతడిని ప్రియాంక బోనులో పెట్టింది. అయితే హౌస్మేట్స్ మానస్‌ను నిర్దోషిగా తేల్చారు.
కాజల్.. యానీ తనను వెక్కిరిస్తుందంటూ బోనులో నిలబెట్టింది. అయితే ఆమె వెక్కిరించలేదని, అది తన బాడీ లాంగ్వేజ్ అని సిరి వాదించింది. షణ్ను.. నేను ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడతాననడం, నన్ను యూట్యూబ్ వరకే అని చెప్పడం నచ్చలేదంటూ సన్నీని బోనులో నిలబెట్టాడు.ఇక్కడ కొద్దిసేపు డిస్కషన్ నడిచింది. ఇందులో మెజారిటీ కంటెస్టెంట్లు షణ్నును సమర్థించారు. అందరూ మధ్యలో రావడం వల్లే గొడవలు వస్తున్నాయని కాజల్ ఉన్నమాట చెప్పింది. మొత్తంగా సన్నీ మెడలో గిల్టీ బోర్డు వేలాడదీశారు. తర్వాత సన్నీ సేవ్ అయినట్లు వెల్లడించాడు నాగ్.