అమ్మా రాజశేఖర్ లేదా సుజాత‌…వీరిద్దరిలో ఒకరు ఔట్!

286
amma rajashekar
- Advertisement -

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 34 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక 5వ వారం ఇంటి నుండి ఎలిమినేట్ కాబోతుంది ఎవరోనన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఈ వారం ఎలిమినేషన్లో అభిజిత్,అఖిల్,లాస్య,సొహైల్,నోయల్,అరియానా,మోనాల్,సుజాత,అమ్మా రాజశేఖర్ ఉండగా వీరిలో సొహైల్ ఇప్పటికే సే అయ్యారు. వచ్చేవారం కెప్టెన్‌గా సొహైల్ ఎన్నికవడంతో ఎలిమినేషన్‌ నుండి తప్పించుకున్నారు సొహైల్.

ఇక మిగిలిన 8 మందిలో ఎలిమినేట్ కాబోతుంది ఎవరా అన్న ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే అభిజిత్ టాప్లో ఉండగా లీస్ట్‌లో సుజాత,అమ్మా రాజశేఖర్ ఉన్నారు. ఇప్పటివరకు 2 లక్షల 7 వేల 631 మంది ఓటింగ్‌లో పాల్గొనగా 35 శాతం ఓట్లతో అభిజిత్ టాప్‌లో ఉన్నారు. తర్వాత స్ధానంలో అఖిల్ 18.45,లాస్య 9.37,సొహైల్ 9.35,నోయల్ 7.86,అరియానా 6.55,మోనాల్ 4.60,సుజాత 4.31,అమ్మా రాజశేఖర్ 4.12 శాతం ఓట్లతో ఉన్నారు.

గత నాలుగు వారాల ఎలిమినేషన్స్‌ని పరిశీలిస్తే లీస్ట్‌లో ఉన్న సూర్య కిరణ్, కరాటే కళ్యాణి,దేవి నాగవల్లి, స్వాతి దీక్షిత్ ఎలిమినేట్ కానున్నారు.దీంతో ఓటింగ్ పరంగా సుజాత లేదా అమ్మా రాజశేఖర్‌లలో ఒకరు ఇంటి నుండి బయటకు రానున్నారు. మొత్తానికి ఈ సస్పెన్స్‌కు తెరపడాలంటే మరికొద్దిగంటలు వేచిచూడాల్సిందే.

- Advertisement -