ఉదయం అఖిల్‌తో…రాత్రి అభిజిత్‌తో:మోనాల్‌పై సుజాత కామెంట్స్‌

115
sujatha

బిగ్ బాస్ తెలుగు విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుని 6వ వారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. 5వ వారంలో ఇంటి నుండి బయటకు వచ్చింది జోర్దార్ సుజాత. ఈ సందర్భంగా బిగ్బాస్ బజ్‌లో భాగంగా రాహుల్ సిప్లిగంజ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోనాల్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

మోనాల్ రెండు పడవలపైన అటో కాలు ఇటో కాలు వేసి నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది. అటు అఖిల్.. ఇటు అభిజిత్ ఇద్దరితోనూ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటూ వస్తోంది…అఖిల్‌తో ప్రాబ్లమ్‌గా ఉంటే అభిజిత్ …. అభిజిత్‌తో ప్రాబ్లమ్ అయితే అఖిల్‌‌కి దగ్గరౌవుతుందని తెలిపింది. ఇంటి సభ్యులకు కూడా వాళ్లు ఆమెను ఇబ్బంది పెడుతున్నారో లేక వాళ్లే ఆమెని ఇబ్బంది పెడుతున్నారో తెలియడం లేదన్నారు.

ఇది ట్రై యాంగిల్‌ లవ్‌స్టోరినో ఏందో తెలియదు గానీ తనకు తెలిసినంత వరకు ఇది వి యాంగిల్ లవ్ స్టోరీ అని తెలిపింది. ఇక మోనాల్ విషయంలో అభి-అఖిల్ ఇద్దరు ఒకరిపై మరొకరు ద్వేషాన్ని పెంచుకుంటున్నారని తెలిపింది సుజాత. వాళ్లకి పర్సనల్‌గా గొడవలు ఏం లేవు…. మోనాల్ వల్లే కథ వేరేలా అవుతుంది. ఇద్దరి ఫీలింగ్స్‌తోనూ మోనాల్ ఆడుకుంటుందని కుండబద్దలు కొట్టింది.

మోనాల్ ఉదయం లేవగానే అఖిల్‌తో మాట్లాడుతూ ఉంటుంది. రాత్రి కాగానే అభిజిత్‌తో మొదలేస్తాది. పొద్దున్న ఆయనతో.. రాత్రికి ఈయనతో.. అది చూసేవాళ్లకి ఏదోలా అనిపిస్తుందని తెలిపింది.