12వ వారం ఓటింగ్‌లో టాప్‌లో మోనాల్‌!

92
monal

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుంది. ఇక మరో నాలుగు వారాలే మిగిలిఉండగా 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాలుగోవారంలో ఎలిమినేషన్‌లో మోనాల్,అఖిల్,అరియానా,అవినాష్‌లు ఉండగా ఓటువేసేందుకు పెద్దసంఖ్యలో ప్రేక్షకులు ఆసక్తికనబరుస్తున్నారు.

ఇక 12వ వారం ఓటింగ్‌లో టాప్‌లో నిలిచింది మోనాల్. ఇప్పటివరకు 163097 మంది ఓటింగ్‌లో పాల్గొనగా మోనాల్‌కు 72630 ఓట్లు రాగా అఖిల్‌కు 33006,అరియానాకు 29424,అవినాష్‌కు 28037 ఓట్లు వచ్చాయి. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ నుంచి సూర్యకిరణ్, కల్యాణి, దేవీ నాగవల్లి, స్వాతి దీక్షిత్, సుజాత, కుమార్ సాయి, దివి, అమ్మ రాజశేఖర్,మెహబూబ్‌,లాస్యలు ఎలిమినేట్ కాగా, ఆరోగ్యం బాగాలేదంటూ గంగవ్వ, నోయల్ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే