దుబ్బాకలో 144 సెక్షన్‌…

119
joel davis

నవంబర్ 3న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంట‌ల‌ నుండి నవంబర్ 4వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాలలో సెక్షన్ 144 అమల్లో ఉంటుందని పోలీసు కమిషనర్ డి జోయెల్ డేవిస్ పేర్కొన్నారు.

ఐదుగురి కంటే ఎక్కువ మంది ఒకే చోట గుమిగూడడానికి అనుమతి లేద‌ని… ఈ మూడు రోజులలో పార్టీ జెండాలు లేదా ప్లకార్డులు ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని ప్రజలను కోరారు. స‌మావేశాలు, ధ‌ర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప‌టాకులు పేల్చ‌డాన్ని నిషేధించిన‌ట్లు వెల్ల‌డించారు. ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయని స్పష్టం చేశారు.

టీఆర్ఎస్ నుండి సోలిపేట సుజాత,బీజేపీ నుండి రఘునందన్ రావు,కాంగ్రెస్‌ నుండి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి బరిలో ఉన్న సంగతి తెలిసిందే.