బిగ్ బాస్ 4..ఎపిసోడ్ 14 కరాటే కళ్యాణి ఔట్

273
karate kalyani

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 సక్సెస్ ఫుల్‌గా 14వ ఎపిసోడ్‌లను పూర్తిచేసుకుంది. వీకెండ్ కావడంతో ఎంట్రీ ఇచ్చిన నాగ్ .అదరిపోయే డ్యాన్స్‌తో ఎంటరైన నాగ్‌…ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తొలుత డబుల్ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రకటించారు. ఇక ఎపిసోడ్ విషయానికొస్తే గంగవ్వ సేఫ్ జోన్‌లోకి వెళ్లడం, హీరో-జీరో టాస్క్, రాజశేఖర్ మాస్టర్ కంటతడి,కరాట్ కల్యాణి ఎలిమినేట్ కావడం ఎపిసోడ్ హైలైట్స్.

తర్వాత గంగవ్వతో మాట్లాడిన ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకోగా బాగుందని తెలిపింది గంగవ్వ. ఇప్పుడు హౌస్‌లో నుండి వెళ్తావ అని అడగగా వెళ్లనని నవ్వుతూ తెలిపింది గంగవ్వ. తర్వాత ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్న 9 మందికి క్లాస్ పీకిన నాగ్‌….ఇందులోనుండి గంగవ్వ సేఫ్ అయినట్లు ప్రకటించారు.

రెండో వారం కిచెన్‌ టీంలో దేవి, మొనాల్, లాస్య,సుజాతలు ఉండగా.. కూరగాయలు తరిగే విషయంలో కళ్యాణి రచ్చ చేసింది. కళ్యాణి కూరగాయలు కట్ చేస్తుండగా.. లాస్య అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. నేను కిచెన్‌లోకి రావడమే కాదు.. తినడమే మానేస్తా.. నాకు ఫ్రూట్స్ ఇవ్వండి చాలు.. ప్రతిదానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు అంటూ ఏడ్చేసింది.

ఒప్పో ఫొటో కాంటెస్ట్‌లో భాగంగా ఇంటిలోని సభ్యులు నాలుగు టీంలుగా విడిపోయి ఒప్పో ఫోన్‌తో ఫొటోలు తీయాల్సి ఉంటుందని బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. అయితే ఫొటోలు తీయడంలో నాలుగు టీంలు తమ క్రియేటివిటీకి పదును పెట్టారు. రాజశేఖర్ మాస్టర్.. దివి-మొహబూబ్‌లను స్విమ్మింగ్ పూల్‌లోకి దింపి మరీ ఫొటోలు తీయగా.. మొనాల్-అభికి కిస్‌లు ఇస్తూ ఫొటోలకు పోజులు ఇచ్చింది.

తర్వాత హీరో, జీరో అనే టాస్క్ సభ్యులకు ఇచ్చారు నాగ్. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు.. మీలో ఎవరు హీరో, జీరో అని భావిస్తున్నారో తెలియజేస్తూ.. హీరో అని భావించిన వాళ్లను కుర్చీలో కూర్చోబెట్టాలని.. అలాగే జీరో అని భావించిన వాళ్లను మెడపట్టుకుని బయటకు నెట్టాలని సూచించారు నాగార్జున.

తొలుత నోయల్.. రాజశేఖర్ మాస్టర్‌ని హీరో అని భావిస్తూ కుర్చీలో కూర్చోబెట్టగా.. కుమార్ సాయికి హౌస్‌లో జీరో చేశారు. తర్వాత సుజాత కూడా రాజశేఖర్ మాస్టర్‌ని హీరో చేస్తూ కరాటే కళ్యాణిని జీరో చేసింది. సొహైల్.. నోయల్‌ని హీరోగా భావించగా.. కళ్యాణిని జోరోగా అభివర్ణించాడు.

తర్వాత కంటతడి పెడుతూ యాంకర్ దేవి..అరియానా గ్లోరీని హీరోయిన్‌గా భావిస్తూ ఆమెను కుర్చీలో కూర్చోబెట్టింది. జీరోగా అమ్మా రాజశేఖర్‌ని ఎంపికచేసింది. మొహబూబ్.. హీరోగా లాస్యను కుర్చీలో కూర్చోబెట్టగా.. కుమార్ సాయిని జీరో చేశాడు. దేత్తడి హారిక.. అభిజిత్‌ని హీరోగా అభివర్ణిస్తూ కుర్చీలో కూర్చోబెట్టగా… కుమార్ సాయిని జీరోగా అభివర్ణించింది.

ఇక లాస్య గంగవ్వను హీరోగా అభివర్ణించగా.. అమ్మా రాజశేఖర్‌ని జీను చేసింది. అంతేగాదు ఆయనపై పలు కామెంట్లు చేయడంతో రాజశేఖర్ మాస్టార్ ఏడ్చేశారు. సభ్యులంతా ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. పలుమార్లు నాగార్జున సైతం రాజశేఖర్ మాస్టర్‌ని ఓదార్చే ప్రయత్నం చేశారు.

తర్వాత కల్యాణి… యాంకర్ సుజాతని జీరోగా చేయగా గంగవ్వను హీరో చేసింది. అఖిల్ మాట్లాడుతూ.. గంగవ్వను హీరోగా అభివర్ణించాడు. కుమార్ సాయిని జీరోగా చెప్పాడు. అరియానా గ్లోరీ….కల్యాణిని జీరో చేయగా గంగవ్వను హీరో చేసింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన అవినాష్…అమ్మ రాజశేఖర్‌ని హీరో చేయగా సాయిని జీరో చేశారు. దివి కూడా అమ్మరాజశేఖర్‌ని హీరోగా చేయగా సాయిని జీరో చేసింది.