అఖిల్ స్వయం వరానికి అతిథిగా అఖిల్!

50
akhil

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 50 ఎపిసోడ్‌లు పూర్తి చేసుకుంది. దసరా ఎపిసోడ్‌ సందర్భంగా సమంత హోస్ట్‌గా వ్యవహరించగా అఖిల్ అతిథిగా హాజరయ్యారు. తొలుత స‌మంత స్వ‌యంవ‌రం ప్ర‌క‌టించింది. ఇది మూడు రౌండ్లు ఉంటుంద‌ని తెలిపింది. మొద‌ట వ‌చ్చిన అభిజిత్ సాంగ్‌ పాడాడు. సోహైల్‌..డైలాగులు చెప్తుంటే అరియానా అడ్డుప‌డింది.

బంగారు క‌ళ్ల బుచ్చొమ్మో.. అంటూ అఖిల్ పాట పాడాడు. అనంత‌రం అమ్మాయిలంద‌రూ అఖిల్ న‌చ్చాడ‌ని ఏక‌గ్రీవంగా ప్ర‌క‌టించారు. దీంతో అత‌నికి ఓ స్పెష‌ల్ గిఫ్ట్ అంటూ అఖిల్ ఇంటిస‌భ్యులు మాట్లాడిన వీడియోను చూపించారు.

నిన్ను చాలా మిస్ అవుతున్నాం, నువ్వు ఏడ‌వ‌డం చూసి బాధ‌ప‌డ్డాం. కానీ మ‌మ్మీ ఐ ల‌వ్ యూ అని చెప్పిన సంఘ‌ట‌న నా జీవితంలోని క‌ష్టాల‌ను పోగొట్టింది. నీ రూమ్‌లోకి వెళ్లి నీకోస‌మే ఆలోచిస్తున్నాం. అంద‌రితో క‌లిసి ఉండు, మంచిగా ఆడు, అదే నాకు సంతోషం” అని అఖిల్ అమ్మ మాట్లాడింది.