దుబ్బాక ఉప ఎన్నిక…పకడ్బందీ ఏర్పాట్లు

838
Holikeri
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి. ఎన్నికల్లో 23 మంది అభ్యర్ధులు పోటీ చేస్తుండగా 315 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేలా చూస్తున్నామని వెల్లడించారు.

స‌మస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పటిష్ట భద్రత చర్యలు చేపడతున్నామన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రా రెడ్డి కలెక్టర్ కు వివరించారు. ఈ నెల 28 వ తేదీలోపు ఫోటో ఓటరు జాబితాను పూర్తి చేయాలని సూచించారు. కోవిడ్ నేపథ్యంలో పోలింగ్ రోజూ కేంద్రాల వద్ద చేతి తొడుగులు, థర్మల్ స్క్రీనింగ్, శాని టైజర్, మాస్క్ లను అందుబాటులో ఉంచాలన్నారు. ఓటర్లు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.

ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఎస్ఎస్టీ, వీడియో వ్యూయింగ్ టీమ్, వీఎస్టీ, ఏంసీఏంసీల పనితీరును, ర్యాండమైజే షన్ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆఫ్ లైన్, ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్, వీడియో గ్రఫీ ఏర్పాట్ల పై ప్రశ్నించారు.

- Advertisement -