బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 96 హైలైట్స్

65
episode 96

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 96 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 96వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యుల మధ్య కామెడీ,టాస్క్‌లు,సొహైల్-అరియానా మధ్య రాజీ కుదుర్చేవంటి వాటితో అలా నడిచిపోయింది. తొలుత ఉదయాన్నే కిచెన్‌లో మోనాల్, సోహెల్ మధ్య సరదా కాన్వర్జేషన్ జరిగింది. వంటగదిలో పనిచేస్తున్నా నాకు జీతం ఇవ్వండి అంటూ మోనాల్‌ను ఆటపట్టించాడు సోహెల్. ఆమె చేతిపై కొరికేందుకు ప్రయత్నించి కామెడీ తెప్పించాడు.

తర్వాత ఏకాగ్రత పేరుతో టాస్క్ ఇచ్చాడు. ఇంటి సభ్యులు 30 నిమిషాల సమయాన్ని ఆపకుండా లెక్కబెడుతూ సరైన 30 నిమిషాల సమయాన్ని కనిపెట్టాలన్నారు. మిగిలిన ఇంటి సభ్యులు టాస్క్ ఆడుతున్న వారిని సమయం లెక్కపెట్టనీయకుండా చేయాలి. అలాగే, టాస్క్‌లో ఉన్న సభ్యుడిని ఏదో ఒక ప్రశ్న అడుగుతూ తికమక పెడుతూనే ఉండాలని తెలిపాడు. 30 నిమిషాలు అయిపోయాయి అని అనిపిస్తే క్లాక్ సెటప్ వద్ద ఉంచిన బెల్‌ను కొట్టాలి…ఎవరైతే 30 నిమిషాల సమయాన్ని సరిగ్గా ఊహించగలుగుతారో వారే విజేతలుగా నిలుస్తారని చెప్పారు బిగ్ బాస్.

ఈ టాస్క్‌లో మోనాల్‌కు సహాయం చేస్తానని అఖిల్ ఆమెకు సీక్రెట్‌గా చెప్పాడు. టైమ్ అయిపోగానే విజిల్ కొట్టు అని మోనల్ అడిగింది. అయితే,సమయం అయిపోగానే నేను లేచి నిలుచుంటా అని క్లూ ఇచ్చాడు అఖిల్. ఈ టాస్క్‌లో మొదట మోనాల్ పాల్గొంది. ఆమెను ప్రశ్నలతో ఆటాడుకున్నారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా అభిజిత్ పిల్లలు ఎలా పుడతారు అని మోనాల్‌ని అడగ్గా అమ్మ హాస్పిటల్‌కు వెళ్తుంది. అక్కడ డాక్టర్ హెల్ప్ చేస్తారు. అదొక గిఫ్ట్ అని తెలిపింది.

ఇలా ఈ టాస్క్‌లో అందరూ పాల్గొని 30 నిమిషాల సమయాన్ని లెక్కపెట్టి ఆ సమయాన్ని తాము గెస్ చేసినప్పుడు బెల్ నొక్కారు. అరియానా 30 నిమిషాలను అందరి కన్నా దగ్గరగా అంచనా వేసింది కాబట్టి ఆమెను బిగ్ బాస్ విజేతగా ప్రకటించారు.

తర్వాత అరియానాతో కాంప్రమైజ్‌కు ప్రయత్నించాడు సోహెల్. అయితే అరియానా కాంప్రమైజ్ కాకపోవడంతో సోహైల్‌- అఖిల్ మధ్య గొడవ జరిగింది. దీంతో సోహెల్ మరింత ఫీలయ్యి అఖిల్‌పై అరిచేశాడు. అయితే ఎప్పటిలాగే రాత్రి పడుకునే ముందు ఇద్దరు కూల్ అయ్యారు. దీంతో ఎపిసోడ్ ముగిసింది.