బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 83 హైలైట్స్

77
bigg boss 4

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 83 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 83వ ఎపిసోడ్‌లో భాగంగా దెయ్యం ఎపిసోడ్ ముగియడం, ఇంట్లో బెస్ట్,వరెస్ట్ కెప్టెన్‌ ఎంపిక జరగడం వంటి వాటితో ఎపిసోడ్ ముగిసింది.

మార్నింగ్ వేకప్‌ సాంగ్‌కి ఇంటి సభ్యులు ఆసనాలు,యోగా చేశారు. అయితే మోనాల్‌ని చూసి అవినాష్ ఆసనాలు వేసే క్రమంలో బొక్క బోర్లా పడ్డాడు.తర్వాత గత రెండు రోజులుగా బిగ్ బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్క్ జలజ దెయ్యంలో ఇంటి సభ్యుల ప్రదర్శన నిరాశాజనకంగా ఉందంటూ బిగ్ బాస్ ఆగ్రహించాడు. అభిజిత్ ఈ టాస్క్‌లో పాల్గొనడానికి నిరాకరించారని అందుచేత అభిజిత్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా ప్రకటించారు బిగ్ బాస్. ఈ టాస్క్‌లో ఎందుకు విఫలం అయ్యారో.. ఎక్కడ పొరపాటు జరిగిందో ఇంటి సభ్యులు చర్చించుకుని అభిప్రాయాన్ని బిగ్ బాస్‌కి తెలియజేయాలని చెప్పారు.

ఇక మోనాల్‌తో డేట్ విషయం గురించి మాట్లాడిన అభిజిత్…..‘మోనాల్‌తో డేట్‌కి వెళ్లాలని పంపిన లెటర్ వల్ల నేను పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. ఆ లెటర్‌లో మీరు ఫ్రేమ్ చేసిన పదాలు (అఖిల్, అభిజిత్‌లు మోనాల్‌ని ఏడిపించారు) నాకు అర్థంకాలేదు.. ఆమెను నేను ఏడిపించాను అంటే పర్సనల్‌గా హర్ట్ అయ్యా.. అందుకే టాస్క్‌లో పెర్ఫామ్ చేయలేదని తెలిపాడు. ఒకవేళ నా వల్ల మిస్టేక్ జరిగితే క్షమాపణ కోరుతున్నా అని తెలిపాడు.

బిగ్ బాస్ హౌస్‌లో రేస్ టు ఫినాలు మొదలైందని.. తిరిగి ఫినాలే వరకూ బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ ఉండరని చెప్పారు బిగ్ బాస్. చివరి కెప్టెన్‌గా ఉన్న హారిక బ్యాండ్‌ని తీసివేయాలని కోరారు. తర్వాత మీలో ఎవరు బెస్ట్ కెప్టెన్.. ఎవరు వరస్ట్ కెప్టెన్ తెలియజేయాల్సి ఉంటుందని తెలిపాఉ బిగ్ బాస్. ఒక్కొక్కరిగా తమ అభిప్రాయాలను తెలపగా ముందుగా సొహైల్…నేను ఎవర్నీ ఇబ్బంది పెట్టకుండా ముందుకు వెళ్లిపోయా.. కెప్టెన్ కూడా కష్టపడి అయ్యా.. ముగ్గురు పోటీదారులతో పోరాడి కెప్టెన్ అయ్యా అని తెలిపాడు.అరియానా మార్పు నాతోనే మొదలు అయిందని ఎవరి స్పేస్ వాళ్లకు ఇచ్చానని తెలిపింది. అఖిల్ కూడా తాను చాలా కష్టపడి కెప్టెన్ అయ్యానని తెలిపాడు.

లీడర్ షిప్ స్కిల్స్‌ నాలో చాలా బాగా ఉన్నాయని అనిపించింది. బై ది పీపుల్.. ఫర్ ది పీపుల్.. టు ది పీపుల్ అన్న రేంజ్‌లో చేశానని హారిక తెలపగా ఎవరు బెస్ట్ కెప్టెన్ అన్న డిస్కషన్స్‌లో అంతా ఏకాభిప్రాయంతో హారిక బెస్ట్ కెప్టెన్‌గా ఎంపికచేశారు. వరెస్ట్ కెప్టెన్‌గా అరియానా పేరును తెలిపారు.ఎవరు బెస్ట్ ఎవరు వరస్ట్ కెప్టెన్ అన్న డిష్కషన్స్‌లో సొహైల్‌ని ఛీ అంటూ ఛీ కొట్టింది మోనాల్. దీంతో సొహైల్ వింత వింతగా ప్రవర్తిస్తూ కోపంగా ఊగిపోవడంతో అతన్ని శాంతింపజేసేందుకు హగ్ ట్రీట్ మెంట్ ఇచ్చి శాంతింపజేసింది . ఇక చివర్లో అరియానా-అవినాష్ మధ్య డిస్కషన్ జరగడంతో ఎపిసోడ్ ముగిసింది.