బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 74 హైలైట్స్

35
episode 74

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 74 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 74వ ఎపిసోడ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. వారి కుటుంబసభ్యులతో మాట్లాడే అవకాశం కల్పించారు. దీంతో తల్లి ప్రేమతో అంతా గొడవలను మర్చిపోయి ఒక్కటయ్యారు.అఖిల్ -అభి,సొహైల్-హారిక ఇలా ఇప్పటివరకు ఉన్న విభేదాలను పక్కనపెట్టి కలిసిపోయారు.

‌ఓ వైపు మ‌ట‌న్ పాడు చేసినందుకు కంటెస్టెంట్ల‌తో చీవాట్లు, మ‌రోవైపు నాన్‌వెజ్ తిన‌కూడ‌ద‌న్న బిగ్‌బాంబ్‌ నేపథ్యంలో అవినాష్‌ను ఆటాడుకున్నారు ఇంటి సభ్యులు. ముఖ్యంగా సొహైల్,లాస్య,హారిక…అవినాష్‌కు ఊరిళ్లు తెప్పిస్తూ మటన్ లాగించారు.

త‌ర్వాత హౌస్‌లోకి ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్‌ని పంపించాడు బిగ్ బాస్. ముందుగా అఖిల్ అమ్మ దుర్గ‌ రాగానే కంటతడి పెట్టాడు. మోనాల్ ఇచ్చిన చాక్లెట్‌ను అఖిల్ త‌న అమ్మ‌కు ఇచ్చాడు. ఇంటి సభ్యులందరిని పలకరిస్తూ ముఖ్యంగా అభిజిత్‌తో నీ బ్రదర్‌ని జాగ్రత్తగా చూసుకో అంటూ తెలిపింది అఖిల్ మదర్‌. హారిక‌ను ప‌ట్టుకుని నీలాంటి ఆడ‌పిల్ల కావాలి అన‌డంతో ఆనందంతో గాల్లో తేలియాడింది.

తర్వాత హారిక త‌ల్లి జ్యోతిని బిగ్ బాస్‌లోకి పంపించారు. హారిక‌ను చూసుకుంటున్నందుకు అభిజిత్‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచాన‌ని హారిక చెప్గా ఈసారైనా గెలుస్తావా? అని ఏడిపించింది. తర్వాత లోనికి వ‌చ్చిన అభిజిత్ అమ్మ ల‌క్ష్మి‌ కొడుకును చూడ‌గానే సంతోషంతో ఏడ్చేసింది. దీంతో ఎమోష‌న‌ల్ అవొద్దు అంటూ అభి త‌ల్లిని ఓదార్చాడు. అంద‌రి యోగ‌క్షేమాల‌ను అడిగి తెలుసుకుంది. త‌న‌కు కూడా హౌస్‌లో ఓ రోజు ఉండాల‌నుంద‌ని మ‌న‌సులోని మాట చెప్పింది. ఈ అవ‌కాశం మ‌ళ్లీ దొర‌క‌ద‌ని బాగా ఎంజాయ్ చేయండి, కొట్టుకోండి అని స‌ల‌హా ఇచ్చింది. అభి అమ్మరాకతో ఇంట్లో సీన్ మొత్తం మారిపోయింది. అఖి-అఖిల్ కలిసిపోవడం,హారిక..సొహైల్‌కు సారీ చెప్పడంతో ఇంట్లో ప్రశాంత వాతావరణం కనిపించింది.

త‌ర్వాత అవినాష్ అమ్మ మ‌ల్ల‌వ్వ‌ లోప‌ల‌కు వ‌చ్చింది. కొడుకు మీద ముద్దుల వ‌ర్షం కురిపించింది. కంటెస్టెంట్లు అంద‌రూ బాగుండాల‌ని రోజూ దేవుళ్ల‌కు పూజ‌లు చేస్తున్నాన‌ని చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి ప్రతిసారి మాట్లాడకు బయటికి రాగానే పెళ్లి చేస్తానని తెలిపింది. వెళ్లిపోయే ముందు హౌస్‌మేట్స్‌తో క‌లిసి హుషారుగా స్టెప్పులేసింది. మొత్తంగా ఈ ఎపిసోడ్ ఇంటి సభ్యులందరిని మార్చేసింది.