బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 73 హైలైట్స్

29
epsiode 73

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 73 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. 73వ ఎపిసోడ్‌లో భాగంగా అఖిల్-మోనాల్ ఘాటు ముద్దులు,ఇంటి సభ్యుల అదిరిపోయే పర్ఫామెన్స్‌తో ముగిసింది.

తొలుత ఛల్ ఛలో ఛలో ఛలో సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులు వేశారు ఇంటి సభ్యులు. ఇక అరియానా-సొహైల్‌లు హౌస్‌లో జరుగుతున్న త్యాగాల గురించి మాట్లాడుకున్నారు. తర్వాత బిగ్ బాస్ ఇళ్లు కమాండో ఇన్‌స్టిట్యూట్‌గా మారబోతుందని.. తొలిరోజు ట్రైనింగ్‌లో భాగంగా ఇంటి సభ్యులకు కొన్ని ఛాలెంజ్‌లు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు బిగ్ బాస్.

తొలుత డ్రిల్స్, పాకడం లాంటి టాస్క్‌లన్నింటినీ అందరికంటే ముందు కంప్లీట్ చేసిన సొహైల్ వెయిట్ ఛాలెంజ్‌ను స్వీకరించాడు. స్విమ్మింగ్ పూల్ అవతల ఉన్న వెయిట్స్ ఒక్కొక్కటినీ స్విమ్మింగ్ పూల్ వెంట ఇవతలవైపుకి పెట్టాలని చెప్పగా సొహైల్ విఫలమయ్యాడు.

రెండో ఛాలెంజ్‌లో భాగంగా పోల్‌ని వాటేసుకుని కాళ్లు చేతులు కింద తగలకుండా ఉండే టాస్క్‌ని చేయడానికి అఖిల్ ముందుకు వచ్చాడు. అయితే ఈ టాస్క్‌ని అతి కష్టంపై కంప్లీట్ చేశాడు అఖిల్.

ఇక మూడో బజర్‌ని మోగించి మంకీ బార్ టాస్క్‌ ఛాలెంజ్‌ను స్వీకరించాడు అభిజిత్. ఈ టాస్క్‌లో భాగంగా మంకీ బార్ మీద కాళ్లూ చేతులూ వేసి వేలాడుతూ 10 నిమిషాలు పాటు ఉండాల్సి ఉంటుందని చెప్పగా అతికష్టంమీద టాస్క్ గెలిచాడు అభిజిత్. టాస్క్ నెగ్గిన వెంటనే ఇకపై తాను సరిగా టాస్క్‌లు చేయడం లేదని నామినేట్ చేయవద్దని కోరారు. అయితే లాస్ట్ బజర్‌ను హారిక మోగించి.. టైర్ టాస్క్‌ని విజయవంతంగా కంప్లీట్ చేసింది.

అఖిల్ బర్త్ డే కావడంతో ఇంటి సభ్యులు తయారు చేసిన కేక్‌ని కట్ చేశాడు అఖిల్. అయితే పాత గొడవల్ని పక్కన పెట్టేసి అఖిల్‌కి బర్త్ డే విషెష్ అందించాడు అభిజిత్. అయితే అఖిల్ బర్త్ డే సందర్భంగా మోనాల్…అఖిల్‌ని హగ్ చేసుకుని ముద్దుల వర్షం కురిపించింది. రోజూ బర్త్ డే ఉంటే బాగుండు.. అంటూ తెగ మురిసిపోయాడు.