బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 52 హైలైట్స్

406
episode 52
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 52 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. ఇక మంగళవారం ఎపిసోడ్‌లో అభి-అఖిల్‌ల మధ్య స్నేహబంధం మరింత బలపడటం,మాస్టర్ కంటతడి,అవినాష్‌కు మోనాల్‌ ముద్దు వంటి వాటితో గడిసిపోయింది.

ముందుగా అభిజిత్‌తో మాట్లాడేందుకు అఖిల్ …మోనాల్ వద్ద పర్మిషన్ తీసుకోగా ఓకే చెప్పడంతో అభితో మాట్లాడాడు అఖిల్. ఇక వీరి మధ్యలో అమ్మ రాజశేఖర్ డిస్కషన్ వచ్చింది. మాస్టర్ పిచ్చ లైట్ అని, ఆయన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అభిజీత్ అన్నాడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో జరిగిన విషయాన్ని గుర్తు తెచ్చుకుని కంటతడి పెట్టారు మాస్టర్‌. ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేశారు సోహెల్, మెహబూబ్.

తర్వాత గార్డెన్ ఏరియాలో అరియానా, అవినాష్ మాట్లాడుతుండగా అవినాష్ దగ్గరకు వచ్చిన మోనాల్‌… అతని నుదిటపై ముద్దు పెట్టింది. దీంతో అవినాష్ ఆనందానికి హద్దుల్లేవు. మోనాల్ ముద్దు పెట్టిన విషయాన్ని గట్టిగా అరుస్తూ అఖిల్‌ను టీజ్ చేశాడు అవినాష్.

బిగ్ బాస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో భాగంగా బీబీ డే కేర్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో భాగంగా బిగ్ బాస్ హౌజ్ పసిపిల్లలను చూసుకునే డే కేర్‌గా మారింది. ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా అంటే పిల్లలు, వారిని చూసుకోవాల్సిన కేర్ టేకర్స్‌గా విడిపోయారు. పిల్లలు టీమ్‌లో అవినాష్, అరియానా, మెహబూబ్, హారిక, అమ్మ రాజశేఖర్ ఉన్నారు. కేర్ టేకర్స్‌గా నోయల్, అఖిల్, సోహెల్, మోనాల్, అభిజీత్‌లను బిగ్ బాస్ ఎంపిక చేశారు. హెడ్ మిసెస్ అయిన లాస్యను సంచాలకురాలిగా నియమించారు.

ఈ టాస్క్‌లో భాగంగా కేర్ టేకర్స్ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నం తినిపించాలి. బట్టలు, డైపర్స్ వేయాలి. చదువు చెప్పాలి. వీటితో పాటు పిల్లల్ని ఎంటర్‌టైన్ చేయాలన్నారు. అవినాష్ – నోయల్,అరియానా – సోహెల్,మెహబూబ్ – అఖిల్,హారిక – మోనాల్,అమ్మ రాజశేఖర్ – అభిజీత్ కేర్ టేకర్స్‌గా ఉన్నారు.ఈ టాస్క్‌లో పిల్లలు రచ్చరచ్చ చేశారు. ముఖ్యంగా అమ్మ రాజశేఖర్ నటన అద్భుతం. చిన్న పిల్లాడిలా చాలా బాగా నటించారు. ఇక సోహెల్‌కు అరియానా చుక్కలు చూపించింది. ఏడుపు సౌండ్ వచ్చినప్పుడు కేర్ టేకర్స్ అందరూ పిల్లలకి బట్టలు, డైపర్లు మార్చారు.

- Advertisement -