బిగ్ బాస్ 4…ఎపిసోడ్ 42 హైలైట్స్

15
bigg boss 4

బుల్లితెర రియాలర్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విజయవంతంగా 42 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. శనివారం ఎపిసోడ్ కావడంతో నాగార్జున ఎంట్రీ,తొమ్మదిమంది నామినేషన్‌లో ముగ్గురు సేఫ్‌ అవడం, అమ్మ రాజశేఖర్‌కి గుండు కొట్టించడం,ఇంటి సభ్యులకు నాగ్ క్లాస్ పీకడం వంటి ఎపిసోడ్స్‌తో 42వ ఎపిసోడ్ ముగిసింది.

దివి, రాజశేఖర్, అరియానాలు ఎలిమినేషన్ విషయంపై చర్చించారు. నేను వెళిపోతా అంటే నేను వెళిపోతా అంటూ చర్చలు మొదలుపెట్టారు. తర్వాత తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు వారి ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటి సభ్యులకు దోస మేకింగ్ కాంపిటేషన్ జరిగింది. ఈ కాంపిటేషన్‌లో అమ్మా రాజశేఖర్ టీం 15 దోసెలు, లాస్య టీం 12 దోసెలు వేయడంతో మాస్టర్ టీం గెలిచింది.

పొరపాటున మాస్టర్ వేసిన దోసెల బౌల్‌ని సొహైల్ టచ్ చేయడంతో కోపంతో ఊగిపోయాడు అమ్మా రాజశేఖర్. సొహైల్‌ని దొంగ అంటూ మాటలు జారగా సొహైల్ తర్వాత తనను ఎందుకు అలా అన్నారని నోయల్ దగ్గర వాపోయాడు. అయితే తన మాటలను సమర్ధించుకునే ప్రయత్నమే చేశారు రాజశేఖర్ మాస్టర్‌.

హౌస్‌కి రెండుసార్లు కెప్టెన్ అయిన నోయల్‌కి క్లాస్ పీకారు నాగ్‌. రేసర్ ఆఫ్ ది హౌస్ టాస్క్‌లో ఎందుకు డ్రాప్ అయ్యావ్ అని అడగడంతో కుమార్ సాయి సరిగా చేయలేదు అని చెప్పాడు. సరే కుమార్ సాయి సరిగా చేయలేకపోతే నువ్ ఎందుకు తప్పుకున్నావ్.. నువ్ తప్పుకున్నందుకు అవినాష్ ఆడాడు..ఛాన్స్ వచ్చినప్పుడు చివరివరకూ ఆడు అంటూ తెలిపాడు నాగ్‌.

ఇక గతవారం రోజులుగా కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఆట ఆడిన సొహైల్‌ని అభినందించారు ఒక కామెడీ పీస్ (అవినాష్) అరిస్తే ఏడుస్తావా? పంచ్ వేశారు నాగార్జున. ఇక అరియానా కూడా సొహైల్‌పై అరవడంతో అతను సైలెంట్‌గా ఉంటే నువ్ అరుస్తావా? పొగరు అంటావా? క్లాస్ పీకారు నాగార్జున. అతనికి ఇప్పుడుకూడా సారీ చెప్పాలని లేదా? అని అడిగితే.. నేను సారీ అయితే చెప్పను సార్.. అతను ఫ్రెండ్.. కానీ అతను నన్ను అర్థం చేసుకోడని చెప్పింది.
తర్వాత అవినాష్‌కు క్లాస్ పీకారు నాగ్‌.

తర్వాత వారం రోజులుగా ఒకే డ్రెస్‌లో ఉంటున్న మోనాల్‌కు విముక్తి కల్పించే డీల్ ఇచ్చారు నాగ్. ఆమె డ్రెస్ వేరే వాళ్లు వేసుకోవాలని చెప్పగా అరియానా,అవినాష్ ముందుకొచ్చారు. ఇక రెండో డీల్‌లో భాగంగా.. హాఫ్ షేవ్ (అరగుండు, అరగడ్డం) చేసుకుంటే వచ్చేవారం నామినేషన్స్ నుంచి సేవ్ కావొచ్చని.. లేదంటే మీకు ఇష్టమైన వాళ్లను సేవ్ చేయొచ్చని డీల్ ఇచ్చారు నాగార్జున. అయితే నేను సిద్ధం అంటూ ముందుకు వచ్చారు మాస్టర్‌. మిగితా వారంత ఏడ్చినా పట్టించుకోలేదు అమ్మా రాజశేఖర్. అరగుండు తర్వాత మాస్టర్ బోరున ఏడ్వగా మాస్టర్‌ని ఓదార్చుతూ అభినందించారు నాగ్.

ఇక ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న 9 మందిలో మొదటిగా లాస్యను సేవ్ చేశారు నాగార్జున. ఎండుమిర్చి, పచ్చిమిర్చి బ్యాగ్‌లు ఇచ్చి వాటిలో పచ్చి మిర్చీలు వచ్చినవాళ్లు సేవ్ అవుతారని చెప్పగా లాస్య సేవ్ అయింది. రెండో కంటెస్టెంట్‌గా నోయల్, మూడో కంటెస్టెంట్‌గా హారిక సేవ్ అయింది. ఇక మిగిలిన ఆరుగురిలో ఒకరు ఇవాళ ఎలిమినేట్ కానున్నారు.